AP CS: పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్ట్‌లపై ఏపీ సీఎస్ సమీక్ష
ABN , First Publish Date - 2023-07-26T15:55:09+05:30 IST
పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై వెలగపూడి సచివాలయంలో సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project), ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై వెలగపూడి సచివాలయంలో సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి (AP CS Jawahar Reddy) బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటి వరకూ పూర్తి చేసిన పనుల ప్రగతి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు, నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులపైన చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనులు,పునరావాస ఫ్యాకేజికి ఇప్పటి వరకూ చేపట్టిన పనులనుపై సీఎస్ సమీక్ష జరిపారు. నిర్దేశిత గడువు ప్రకారం పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, ఔకు టన్నల్, గొట్టా బ్యారేజి నుంచి హీర మండలం ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన సీఎస్ సమీక్ష చేశారు. వంశధార - నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజి రిజర్వాయర్ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2 తదితర ప్రాజెక్టుల ప్రగతిపైన చర్చించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తి చేసి ప్రారంభించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.