Balakrishna : సీఎంకు మెగా బైట్‌కు.. గిగా బైట్‌కు తేడా తెలుసా?
ABN, First Publish Date - 2023-04-07T10:29:20+05:30
యువగళం పాదయాత్రలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు. నేడు హిందూపురం నుంచి భారీ కాన్వాయ్‌తో గార్లదిన్నె మండలం మర్తాడు శివారు క్యాంప్ సైట్‌కు బాలకృష్ణ చేరుకున్నారు.
అనంతపురం : యువగళం పాదయాత్రలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు. నేడు హిందూపురం నుంచి భారీ కాన్వాయ్‌తో గార్లదిన్నె మండలం మర్తాడు శివారు క్యాంప్ సైట్‌కు బాలకృష్ణ చేరుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొననున్నారు. దీనికి ముందు బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. మీకోసం.. మీ నాయకుడిని మీరే ఎన్నుకోవాలన్నారు. అసలు ముఖ్యమంత్రికి మెగా బైట్‌కు గిగాబైట్‌కు తేడా తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీయే కాదు. ప్రతి ఒక్కరూ విజృంభించాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తపడి కళ్లు తెరవాలని బాలయ్య పేర్కొన్నారు.
‘‘ఓటే మీకు ఆయుధం. అదే మీకు రక్షణ. రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంది? బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ? వంటివి చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకూ పోలవరం ఊసే ఎత్తలేదు. రూ.8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్ము? సరే చేశారు. దానితో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంతా శూన్యం. పెన్షన్లు పెండింగ్.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. గంజాయిలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇక రేట్ల విషయానికి వస్తే.. విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్నులు, ఆఖరికి చెత్త మీద కూడా పన్నువేసే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. ఏ నియోజకవర్గంలో చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా పేరిట ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు వేయడం, బెదిరించడం, హత్యా రాజకీయం చేస్తున్నారు. ఐదు కోట్ల మంది కలల రాజధాని అమరావతి గురించి ఊసే లేదు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు ఎక్కడ అడ్డంకి అవుతారోనని వాళ్లు ఏం చేసినా అడ్డుకుంటున్నారు. ప్రత్యేక హోదా అన్నారు అదీ లేదు. ఇవన్నీ జనాలకు తెలియాలి’’ అని బాలయ్య పేర్కొన్నారు.
Updated Date - 2023-04-07T10:43:14+05:30 IST