Chandrababu: 18న శృంగవరపుకోటకు చంద్రబాబు
ABN , First Publish Date - 2023-05-17T21:12:26+05:30 IST
ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోట..
శృంగవరపుకోట: ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా శృంగవరపుకోట (Srungavarapu kota)కు రానున్నారు. దీంతో టీడీపీ (TDP) నాయకులు జిల్లా సరిహద్దు చింతలపాలెం నుంచి విశాఖ- అరకు రోడ్డులో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడుకు చింతలపాలెం వద్ద స్వాగతం చెబుతారు. చంద్రబాబు అక్కడి నుంచి శిరికి గ్రీన్ సిటీకి వస్తారు. అక్కడ భీమసింగి చెరకు రైతులు సమస్యను తెలుసుకుంటారు. అనంతరం కొత్తూరు శివాలయం నుంచి రోడ్‌షో ప్రారంభిస్తారు. దేవిబొమ్మ కూడలిలో రోడ్‌షో ముగిసిన వెంటనే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శిరికి గ్రీన్‌సిటీలోనే రాత్రి బస చేస్తారు. శుక్రవారం శిరికి గ్రీన్‌సిటీలోనే కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ విద్యార్థులు, దాసరి సామాజికవర్గంతో చంద్రబాబు సమావేశమవుతారు.