RaviPrakash: ఆ ఉద్దేశం పోలీసులకు లేదు.. లోకేష్ పాదయాత్రపై డీఐజీ
ABN, First Publish Date - 2023-02-04T11:33:31+05:30
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ స్పందించారు.
తిరుపతి: టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam Padaytra) కు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ (Anantapur Range DIG RaviPrakash) స్పందించారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశం పోలీసులకు లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ (Supreme Court Guidelines) మేరకే విధులను నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్‌ను ఉల్లంఘిస్తే చట్టపరంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. పాదయాత్రను ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. సోషల్ మీడియా (Social Midea) ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. ప్రముఖుల స్థాయిని బట్టి బందోబస్తును కల్పిస్తామని... లోకేష్ (YuvaGalamPadayatra) కు కూడా అదే స్థాయి బందోబస్తును కల్పిస్తున్నామని అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ వెల్లడించారు.
కాగా... నిన్న బంగారుపాలెం చేరుకున్న లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (LokeshYuvaGalam)లో మూడు ప్రచార వాహనాలను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒక సౌండ్ సిస్టం వాహనం, ఒక ప్రచార రథం, వీడియో కవరేజ్‌కు ఏర్పాటు చేసిన లైవ్ వెహికిల్‌ను సీజ్ చేశారు. పాదయాత్రలో ఇలాంటి మైకులు వాడకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బంగారుపాలెంలో చోటు చేసుకున్న పరిణామాలపై డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah Letter To DGP) లేఖ రాశారు. లోకేష్ పాదయాత్ర(Lokesh Padayatra)కు సంబంధించి నిర్ధేశించిన ప్రకారం స్థానిక పోలీసు అధికారులకు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. అధికారపార్టీతో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కై యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగానే విద్యుత్ నిలిపివేశారని... మూడు వాహనాలు సీజ్ చేశారన్నారు. అధికారపార్టీతో కుమ్మక్కై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సీజ్ చేసిన యువగళం వాహనాలను రిలీజ్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించేలా స్థానిక పోలీసు అధికారులకు ఆదేశించాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-02-04T11:33:33+05:30 IST