LokeshYuvaGalam: లోకేష్ యువగళం పాదయాత్రకు అడగడుగునా అడ్డంకులు.. పోలీసులే ఇలా చేస్తున్నారెందుకు.. ఇన్ని కేసులా..!?
ABN, First Publish Date - 2023-02-09T13:10:01+05:30
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది.
చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (NaraLokesh YuvaGalam Padayatra) ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. పోలీసులు ఓ వైపు పాదయాత్రను అడ్డుకుంటూనే.. మరోవైపు లోకేష్ (YuvaGalam Padayatra)పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం 14వ రోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవగా... సంసిరెడ్డిపల్లె వద్ద పోలీసులు (Police) అడ్డుకున్నారు. లోకేష్ (Lokesh YuvaGalam)ను మాట్లాడనీయకుండా మైక్‌ను లాక్కున్నారు. మైక్ తీసుకెళ్తున్న కార్యకర్తపై దాడిచేసి మరీ మైక్‌ను పోలీసులు లాక్కుని పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేటపట్టారు. టీడీపీ శ్రేణులకు మద్దతుగా లోకేష్ (YuvaGalam Padayatra) స్టూల్ మీద ఎక్కి నిరసన తెలిపారు. ఏం రాజ్యాంగంలో ఉన్నాము అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్‌ను ఇచ్చేయాలని పోలీసులను కోరారు.
మరో కేసు నమోదు...
ఇదిలా ఉండగా లోకేష్‌పై చిత్తూరు జిల్లా నర్సంగరాయపేట పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేష్‌పై పెట్టిన ఐదో కేసు ఇది. ఈరోజు ఉదయం ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు వెబ్‌సైట్‌లో పెట్టారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, పాదయాత్రకు ఉన్నతాధికారులు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించడం వంటి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయ్యింది. పోలీసు ఉన్నాతాధికారులే ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గతంలో కుప్పంలో ఒకటి, బంగారుపాల్యెంలో రెండు, పలమనేరులో ఒకటి చొప్పున కేసులు నమోదు అవగా.. తాజాగా చిత్తూరులో లోకేష్‌పై మరో కేసు నమోదు అయ్యింది.
ఈ ఐదు కేసులను చిత్తూరుకు చెందిన టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి (Former Minister Amarnath), పులవర్తి నాని (Pulavarthi Nani), ఎమ్మెల్సీ దొరబాబు (MLC Dorababu), చంద్రదండు ప్రకాష్ (Chandradandu Prakash)పై నమోదు చేశారు. వీరితో పాటు అనేకమంది కార్యకర్తలపైన కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ 188, 341, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లే కావడం గమనార్హం. తాజాగా లోకేష్‌పై నమోదైన ఐదో కేసులో కూడా అన్నీ బెయిలబుల్ సెక్షన్ల కిందే కేసు నమోదు అయ్యింది. లోకేష్‌పై కేసు నమోదు చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రకు అనుమతి రద్దు చేసేందుకు పోలీసులు ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
మరింత పకడ్బందీ ప్రణాళికతో ముందుకు...
మరోవైపు లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో పాదయాత్రపై ఇంకా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. ఇప్పటి వరకు కుప్పం, పలమనేరు, చిత్తూరు టౌన్, పూతలపట్టులో జరిగిన పాదయాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని... రాష్ట్ర సంక్షేమ పథకాలపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్న నేపథ్యంలో పాదయాత్రకు అనుమతులు రద్దు చేసేందుకు యువనేతపై వరుసగా కేసులు చేస్తున్నారంటూ టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలను ఎదుర్కునేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే అంశంపై టీడీపీ ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-02-09T13:15:55+05:30 IST