ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Laxman: తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి

ABN, First Publish Date - 2023-12-02T17:56:49+05:30

తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ( MP Laxman ) అన్నారు. శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఏపీలో రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తిరుమల వెంకన్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

తిరుపతి: తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ( MP Laxman ) అన్నారు. శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఏపీలో రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తిరుమల వెంకన్న నిధులు పక్కదారి పడుతున్నాయని అన్నారు. భక్తుల విరాళాలు దేవుడి కైంకర్యాలకు వినియోగించాలని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. ప్రాచీన కట్టడాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పురాతన కట్టడాలను కూల్చే సమయంలో టీటీడీ భక్తుల మనోభావాలని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. పార్వటి మండపం పునర్ నిర్మాణం సమయంలో టీటీడీ ఆర్కాలజీ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదించిందో లేదో భక్తులకు తెలియజేయాలని చెప్పారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను టీటీడీ ధర్మ ప్రచారం కోసం మాత్రమే వినియోగించాలన్నారు. తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వ నిధులనో లేక నగరపాలిక నిధులను వినియోగించాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.

Updated Date - 2023-12-02T17:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising