కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN ARREST: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఏలూరులో కాగడాల ప్రదర్శన

ABN, First Publish Date - 2023-09-16T20:58:40+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Nara Chandrababu Naidu Illegal arrest)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు.

NCBN ARREST: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా  ఏలూరులో కాగడాల ప్రదర్శన

ఏలూరు: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Nara Chandrababu Naidu Illegal arrest)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. పలు జిల్లాల్లో రోడ్లపైకి వచ్చి వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Ramanaidu) ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. పెనుమంట్ర మండలం మార్టేరులో పితాని వెంకట్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మంది కార్యకర్తల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ తీశారు. దేవరపల్లిలో నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు.

Updated Date - 2023-09-16T20:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising