ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu Tour: మళ్లీ అదే సీన్.. ఈసారి కూడా చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు

ABN, First Publish Date - 2023-05-05T09:42:57+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ పర్యటించినా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఎక్కడ పర్యటించినా రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవడం, రోడ్‌ షోలకు అనుమతి ఇవ్వకపోవడం, టీడీపీ నేతలను బంధించడం ఇలా పలు విధాలుగా వైసీపీ సర్కార్ ఆటంకాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కూడా చంద్రబాబు పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీడీపీ అధినేత పర్యటించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. రెండో రోజు రామచంద్రపురంలో పర్యటించనున్న చంద్రబాబు పంట నష్టం ప్రాంతాలను పరిశీలించనున్నారు. అయితే పొలాల్లోకి వెళ్లనీయకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం మండలం వెగాయమ్మపేటలో పంట నష్టం పరిశీలించడానికి వెళ్లాలని బాబు షెడ్యూల్‌లో నిర్ణయించారు. తీరా అక్కడకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన చంద్రబాబు... అవసరమైతే నడుచుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. రామచంద్రపురంలో చంద్రబాబు పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ప్రచార రథం వాడేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కాన్వాయ్‌తో ప్రచార రథం కదిలితే సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా రామచంద్రపురంలో చంద్రబాబు పర్యటించి తీరుతారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

చంద్రబాబు షెడ్యుూల్‌లో సస్పెన్స్

రెండో రోజు రామచంద్రపురంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు వెంగయమ్మ పేటలో పంటనష్టాన్ని పరిశీలించాలని షెడ్యూల్‌లో నిర్ణయించారు. చంద్రబాబు వస్తుండడంతో ప్రభుత్వం అక్కడ తడిచిన ధాన్యం లేకుండా చేస్తుండటంతో... బాబు వ్యూహం మార్చారు. పంట నష్టం ఎక్కడ పరిశీలించేది గోప్యంగా ఉంచారు. ఈరోజు ఎక్కడకు వెళ్తారో అనే దానిపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఐదు రోజులు గోదావరి జిల్లాలోనే ఉండడానికి బాబు నిర్ణయించారు. తడిచిన ధాన్యం ఎక్కడిదక్కడే ఉండిపోవడంతో ప్రభుత్వంలో వణుకుపుడుతోంది. సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను పరామర్శించనున్నారు.

ఐదు రోజులు రాజమండ్రిలోనే...

కాగా.. కోనసీమ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించాలన్న నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మార్చుకున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు బాబు వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్న టీడీపీ అధినేత ఐదు రోజుల పాటు రాజమండ్రి కేంద్రంగా గోదావరి జిల్లాలోనే మకాం వేయాలని నిర్ణయించారు. బీవీఆర్ ఫంక్షన్ హాల్లో రాత్రి బస చేయనున్నారు. రేపు కొవ్వూరు, గోపాలపురంలో పంట నష్టం పరిశీలించి.. ఆపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పంట నష్టం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వ్యానులోనే ప్రయాణించి పంటలు పరిశీలించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Updated Date - 2023-05-05T10:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising