ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: జగన్‌రెడ్డిలో భయం కనిపిస్తోంది

ABN, First Publish Date - 2023-09-13T21:19:11+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టుతో జగన్‌రెడ్డి (Jagan Reddy) తాత్కాలిక ఆనందం పొంది ఉండవచ్చు కానీ...ప్రజలు దీన్ని ఆమోదించే పరిస్థితిలో లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.

రాజమహేంద్రవరం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టుతో జగన్‌రెడ్డి (Jagan Reddy) తాత్కాలిక ఆనందం పొంది ఉండవచ్చు కానీ...ప్రజలు దీన్ని ఆమోదించే పరిస్థితిలో లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. బుధవారం నాడు నారా లోకేష్‌తో వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టు అనంతరం నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల అంశంతో పాటు, అరెస్టుపై పార్టీ చేపట్టిన నిరసనలపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌లో భయం కనిపిస్తోందన్నారు. ఆయన నియంత పోకడులతో రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ధర్నాచౌక్‌లో కూడా అనుమతించకపోవడం జగన్ నియంత పోకడలకు అద్దం పడుతోందన్నారు. నిరాహార దీక్ష చేసిన వారిపై కూడా హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్‌కు పంపిన ఘటనలు చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఇవన్నీ ప్రభుత్వ బలహీనత, జగన్ భయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్నివర్గాల్లో అసంతృప్తి, ఆవేదన రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై మద్దతు తెలిపిన నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ బస చేసిన క్యాంప్ కార్యాలయానికి మాజీ మంత్రులు బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రలతో పాటు...పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు వచ్చి కలిశారు.

Updated Date - 2023-09-13T21:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising