Nara Lokesh: యువగళం దెబ్బకి జగన్‌రెడ్డి ముఖం మాడిపోయింది
ABN, First Publish Date - 2023-09-05T20:37:14+05:30
యువగళం(Yuva galam) దెబ్బకి వైసీపీ ఫ్యాన్(YCP fan) రెక్కలు విరిగిపోయాయి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN) ముఖం మాడిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సెటైర్లు వేశారు.
ప.గో (భీమవరం): యువగళం(Yuva galam) దెబ్బకి వైసీపీ ఫ్యాన్(YCP fan) రెక్కలు విరిగిపోయాయి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN) ముఖం మాడిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సెటైర్లు వేశారు. మంగళవారం భీమవరం (Bhimavaram)లో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ..‘‘స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మించిన గడ్డ ఇది. సంక్రాంతి అంటే ఠక్కున గుర్తొచ్చేది భీమవరం.భీమవరం వాళ్లు సినీమా ఇండస్ట్రీని కూడా వదల్లేదు. నటులు, నిర్మాతలు, దర్శకులు భీమవరం వాళ్లే.యువగళం..మనగళం..ప్రజాబలం. మీ లోకేష్ ప్రజల్లో ఉంటాడు...జగన్ పరదాల్లో ఉంటాడు.జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం.. మీ లోకేష్‌ది అంబేద్కర్ రాజ్యాంగం. యువగళాన్ని తొకేస్తాం అన్నారు...ఇప్పుడు రాష్ట్రమంతా యువగళమే.యువగళం దెబ్బకి వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి..జగన్ ముఖం మాడిపోయింది.యువగళాన్ని అడ్డుకోమని ఫ్రస్ట్రేషన్ అంకుల్.. జగన్‌రెడ్డి సైకో సైన్యాన్ని పంపాడు.మన వాళ్లు సైకో సైన్యాన్ని తన్ని పంపారు.ఇప్పుడు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు. మేము ఫ్లెక్సీలు వెయడం మొదలు పెడితే జగన్‌కి గుండెపోటు వస్తుంది. అబ్బాయిలు హూ కిల్డ్ బాబాయ్..? భయం మా బయోడేటాలో లేదు బ్రదర్.నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర. అడ్డుకుంటే దండయాత్ర.జగన్ హాలిడే సీఎం.. ఆయన అప్పుడప్పుడూ 12 కోట్లు పెట్టి హాలిడేకి లండన్ వెళ్తాడు.ఈయన పేదలకి పెత్తందార్లకి యుద్ధం అని ఫోజులు కొడుతున్నాడు.ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు హాలిడే ఇచ్చాడు. పరిశ్రమలు తరిమేసి యువతకు హాలిడే ఇచ్చాడు.ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే ఇచ్చాడు. రైతులను ముంచి క్రాప్ హాలిడే ఇచ్చాడు. ఇప్పుడు పరిశ్రమలకు కరెంట్ కోతలు పెట్టి పవర్ హాలిడే ఇచ్చాడు.పరిశ్రమలకు 12 గంటలు పవర్ హాలిడే అంట. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే యంత్రాలు తిప్పాలట.సమయం దాటి నడిస్తే కేసులు పెట్టి ఫైన్లు వేస్తారట. సైకో జగన్ మెుఖం చూసి వచ్చే పరిశ్రమే లేదు పైగా బాదుడే బాదుడు, పవర్ హాలిడేలు.పెంచిన విద్యుత్ ఛార్జీలు, పవర్ హాలిడే దెబ్బకి పరిశ్రమలు అన్ని బైబై ఏపీ అనడం ఖాయం.చంద్రబాబుని చూస్తే ఏం గుర్తొస్తుంది? కియా, ఫాక్స్ కాన్, హెచ్సిఎల్, పోలవరం,24 గంటల విద్యుత్ గుర్తొస్తాయి.జగన్‌ని చూస్తే ఏం గుర్తొస్తుంది? కోడికత్తి. బూమ్, బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్,అంధకారప్రదేశ్ గుర్తొస్తాయి’’ అని లోకేష్ ఎద్దేవ చేశారు.
జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఆయన ఇచ్చే బిల్డప్‌కి, రియాలిటీకి మధ్య తేడా మీకు తెలియాలి. మూడు రాజధానులు కడతానని బిల్డప్ ఇస్తాడు. రియాలిటీ ఏంటో తెలుసా? అని టీడీపీ నేత లోకేష్ ప్రశ్నించారు. లోకేష్ మాట్లాడుతూ... ‘‘పులివెందులలో బస్టాండ్ కట్టడానికి నాలుగేళ్లు పట్టింది. 22 కోట్లతో బస్టాండ్ కట్టాడు. ప్రారంభించి 8 నెలలు కాకముందే వర్షం వస్తే నీరు కారుతుంది. విశాఖను రాజధాని చేస్తానని అంటాడు. రేపు వెళ్తున్నా, ఎల్లుండి వెళ్తున్నా అంటాడు. అది బిల్డప్ మాత్రమే.కానీ రియాలిటీ ఏంటో తెలుసా 40 లక్షలతో ఒక బస్టాప్ కట్టాడు. అది చిన్న గాలికే ఎగిరిపోయింది. జగన్ బొమ్మ ఊడి కింద పడింది అది సైకో జగన్ కేపాసిటీ.టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఉభయ గోదావరి జిల్లాల్లో తారు రోడ్లు కాకుండా ఖర్చు ఎక్కువ అయినా సిమెంట్ రోడ్లు వేస్తాం.విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే- బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు... ఇంటి పన్ను బాదుడే బాదుడు.. చెత్త పన్ను బాదుడే బాదుడు.. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు.. నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు.యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలని జగన్ కోరుకుంటున్నాడు.జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు.రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.రైతులను ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు.ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి.టీడీపీ మీకు అండగా ఉంటుంది.బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూశాను. సైకోపాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని లోకేష్ హెచ్చరించారు.
జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. ‘‘జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేశాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది జగన్ బాధితులే. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వడం లేదు.2014వ సంవత్సరంలో 15 కి 15 సీట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు టీడీపీకి ఇచ్చారు. జిల్లాపై చంద్రబాబుఎంతో ప్రేమ చూపించారు. సబ్సిడీలు, రాయితీలు ఇచ్చి ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దేశంలోనే నంబర్ 1గా చేశాం. పోలవరాన్ని పరుగులు పెట్టించాం. 72 శాతం పూర్తి చేశాం. నిర్వాసితులను ఆదుకున్నాం. చింతలపూడి ప్రాజెక్టును యద్ధప్రాతిపదికన పూర్తి చేశాం.పామ్ ఆయిల్, వరి రైతులను ఆదుకున్నాం. ఫార్మా, డిఫెన్స్ కంపెనీలు తీసుకొచ్చాం.ఉండి టీడీపీ అడ్డా. సైకో జగన్ మాటలు నమ్మకుండా 2019లో మంతెన. రామరాజు గారిని గెలిపించారు. ఉండి ప్రజలను నేను గుండెల్లో పెట్టుకుంటా. జగన్ పాలనలో ఉండికి గుండు కొట్టాడు. భీమవరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని మీరు గ్రంధి శ్రీనివాస్‌ని గెలిపించారు.ఆయన భీమవరానికి చేసింది ఏం లేదు..? ఆయన ఇంటికి తప్ప నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు వేయించాడా..?కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని ఎమ్మెల్యే భీమవరానికి అవసరమా..?భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ గ్రంధి శ్రీనివాస్.సొంత పార్టీ నేతలే ఇతని అవినీతి గురించి సీఎంకి ఫిర్యాదు చేశారు.అందుకే పేరు మార్చా ఆయన గ్రంధి శ్రీనివాస్ కాదు గజదొంగ శ్రీనివాస్.సైకో జగన్ ఇసుకాసురుడు అయితే గజదొంగ శ్రీనివాస్ భూబకాసురుడు. భూదందాలను బయటపెట్టిన సొంతపార్టీ నాయకులపై గజదొంగ శ్రీనివాస్ కేసులు పెట్టించాడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-05T22:10:04+05:30 IST