ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Achchennaidu: 29రోజులుగా ఏం ఆధారాలు సేకరించారు

ABN, First Publish Date - 2023-10-07T21:44:23+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి 29 రోజులైంది.. స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి 29 రోజులైంది.. స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ``కాంతితో క్రాంతి`` కార్యక్రమంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ..‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారు. 29రోజులుగా సీఐడీ ఏం చేసింది.? 3300కోట్ల అవినీతి ఆరోపణల నుంచి 370 కోట్లు అని ఇప్పుడు 27కోట్లు అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ము అంటున్నారు. విరాళాలు బహిర్గతం చేసేందుకు మేం సిద్ధం. స్కిల్ కేసులో సంబంధo ఉన్నవారెవ్వరు పార్టీకి పైసా విరాళం కూడా ఇవ్వలేదు. క్విడ్ ప్రోకో ద్వారా విరాళాలు సేకరించింది వైసీపీనే. పంచభూతాలను దోచుకున్న జగన్మోహన్‌రెడ్డి అవినీతి సామ్రాట్‌గా ఎదిగాడు’’ అని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు.

ఈరోజు నిరసన వేడి జగన్మోహన్‌రెడ్డికి తాకింది: నిమ్మల రామానాయుడు

జగన్ అవినీతి అక్రమ పాలనను ప్రశ్నించారనే అక్రమ కేసులో చంద్రబాబుని జైలుకు పంపారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఈరోజు నిరసన వేడి జగన్మోహన్‌రెడ్డికి తాకేలా ప్రజలు స్పందించారని రామానాయుడు అన్నారు.

తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపలేరు: జీవీ ఆంజనేయులు

అరచేతితో తెలుగుదేశం ప్రభంజనం ఆపటం జగన్మోహన్‌రెడ్డి తరం కాదని తెలుగుదేశం సీనియర్ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సెక్షన్ల 144లు, సెక్షన్ 30యాక్ట్‌లు ఇంకెన్ని నెలలు పెడతారు. జగన్మోహన్‌రెడ్డి చేసిన 3లక్షల 30వేల కోట్ల అవినీతి పేదలకు పంచితే, ప్రతీ ఒక్కరికీ 10లక్షల రూపాయలు అందుతాయి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే చరమగీతం పాడతారని జీవీ ఆంజనేయులు చెప్పారు.

Updated Date - 2023-10-07T21:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising