Achchennaidu: జగన్ ఏపీలోని సహజ సంపదను దోచుకున్నాడు
ABN, First Publish Date - 2023-10-08T16:25:12+05:30
జగన్ ఏపీలోని సహజ సంపదను దోచుకున్నాడని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.
అమరావతి: జగన్ ఏపీలోని సహజ సంపదను దోచుకున్నాడని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి అబద్ధం పేరుతో బుక్ లెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కుట్రతో మూడు అంశాలపై కేసులు వేశారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఏం అవినీతి లేకున్నా.. అభూత కల్పనలతో కేసులు వేశారు. స్కిల్ కేసులో ఎంతో మందికి శిక్షణ ఇస్తే.. అందులో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో జరిగిందంటూ కేసు వేశారు. అలాగే దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులోనూ అవినీతి జరిగిందంటూ మరో కేసు పెట్టారు. జగన్ అవినీతిని ప్రజలకు వివరిస్తోంటే.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైల్లో వేయించింది’’ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-08T16:25:12+05:30 IST