Atchannaidu: జగన్ రెడ్డికి పాలన చేతకాక అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు
ABN , First Publish Date - 2023-09-01T15:44:08+05:30 IST
అయ్యన్నపాత్రుడి అరెస్ట్ జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు పరాకాష్ట. గన్నవరం సభలో అయ్యన్న వ్యాఖ్యల్లో తప్పేముంది?, ప్రజాస్వామ్య మూలాలను జగన్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారు.
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌ను (Chintakayala Ayyanna Patrudu) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఖండించారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘అయ్యన్నపాత్రుడి అరెస్ట్ జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు పరాకాష్ట. గన్నవరం సభలో అయ్యన్న వ్యాఖ్యల్లో తప్పేముంది?, ప్రజాస్వామ్య మూలాలను జగన్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?, జగన్ రెడ్డికి పాలన చేతకాకే అక్రమ అరెస్ట్‌లతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌పై దిగజారి మాట్లాడే వైసీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదు?, అధికార పార్టీకి ఒక రూలు-ప్రతిపక్షానికి ఒక రూలా?, జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం-ప్రజా సమస్యలపై పోరాటం ఆపం.’’ అని అచ్చెన్నాయుడు తెలిపారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్నపాత్రుడ్ని కృష్ణాజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం యలమంచిలిలో నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. ఇటీవల గన్నవరం సభలో సీఎం జగన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై కేసు నమోదైంది. 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి.