Ayyannapatrudu: ఏపీ పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనబడట్లేదా..?
ABN, First Publish Date - 2023-09-13T14:34:56+05:30
ఏపీ పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనబడట్లేదా..? అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ప్రశ్నించారు.
అమరావతి: ఏపీ పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనబడట్లేదా..? అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ప్రశ్నించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ చంద్రబాబు అక్రమ అరెస్టు (Chandrababu arrested)లో ఢిల్లీ పెద్దల పాత్ర ఉన్నందుకే మాట్లాడట్లేదా?.కేంద్ర పెద్దల మౌనం దేనికి సంకేతం.కేంద్ర పెద్దల ఆశీర్వాదం లేకుండా చంద్రబాబుని అరెస్టు చేయించే ధైర్యం జగన్‌రెడ్డి చేయగలడా ?.కేంద్రం ఇచ్చే నిధులను తినేస్తున్న జగన్ చర్యలు మీకు కనిపించట్లేదా?.రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారి పనిచేస్తున్నాయి.పదిమందికి ఉపయోగపడే అఖిలభారత సర్వీస్ అధికారులు ఇందులో భాగస్వామ్యం కావటం దురదృష్టకరం.40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు. రావణాసురుడు రాజ్యంలో రామపాలన ఎలా సాధ్యం. ఇడుపులపాయ సమీపంలో ఉన్న స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ నుంచి కూడా ఎందరో శిక్షణ పొందారు.స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆమోదానికి మొత్తం మంత్రివర్గoది బాధ్యత.ఇందులో ప్రధాన పాత్రదారులు అజయ్ కళ్లెం, ప్రేమ చంద్రారెడ్డిలను అరెస్టు చేయకుండా వదిలేయడం ఎంతవరకు సబబు.అఖిలపక్ష నేతలంతా కలిసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నీ పరిశీలించి తప్పేముందో తేల్చలి’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
Updated Date - 2023-09-13T14:35:12+05:30 IST