ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Botsa Satyanarayana: చర్చకు రమ్మంటే టీడీపీ నేతలు పారిపోతున్నారు

ABN, First Publish Date - 2023-09-22T17:19:24+05:30

ప్రతిపక్ష టీడీపీ(TDP) ఒక పథకం ప్రకారం అసెంబ్లీ(Assembly) సభ సమయాన్ని వృథా చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు.

అమరావతి: ప్రతిపక్ష టీడీపీ(TDP) ఒక పథకం ప్రకారం అసెంబ్లీ(Assembly) సభ సమయాన్ని వృథా చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు అసెంబ్లీ సెషన్స్‌లో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుపై కేసును ఉపషంహరణ కోసం టీడీపీ నేతలు అసెంబ్లీ సెషన్స్‌లో రచ్చ చేస్తున్నారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుంది. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలి.స్కిల్‌ స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే టీడీపీ నేతలు పారిపోతున్నారు. స్కిల్ స్కామ్‌లో ఎంత అవినీతి జరిగింది ఎలాగో మేం సభలో చెప్పాం..టీడీపీ ఏం చెప్తుందో సభలో చెప్పొచ్చుగా ... చర్చల్లో పాల్గొంటే దొరికిపోతామని టీడీపీ భయపడుతోంది. తప్పు చేశారు కాబట్టే ఏఫీ హైకోర్ట్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. సీమెన్స్ ఒప్పందం ప్రకారం నిధులు ఏమయ్యాయో టీడీపీ సమాధానం చెప్పాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-22T17:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising