CPI Ramakrishna: తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుంది
ABN, First Publish Date - 2023-12-03T22:39:05+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ( CPI Ramakrishna ) వ్యాఖ్యానించారు.
విజయవాడ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ( CPI Ramakrishna ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అవినీతి, అప్రజాస్వామిక పాలనను ప్రజలు తరిమి కొట్టారు. రేపు ఏపీలో కూడా ఇదే ఫలితాలు పునరావృతం అవడం ఖాయం. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాల ద్వారా వేలకోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అపాయిట్మెంట్ ఇవ్వడం లేదు. సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. ఈ దౌర్భాగ్యడు కనీసం ప్రెస్‌మీట్ కూడా పెట్టలేక పోయాడు. అన్నీ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు. జగన్ దురంహంకారి. తప్పకుండా ప్రజలు తరిమి కొడతారు. మేము కూడా అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు సాగుతాం. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కలిసి వెళ్తేనే జగన్‌ను ఓడించవచ్చు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా డిపాజిట్ రాలేదు’’ అని రామకృష్ణ ఎద్దేవ చేశారు.
వారే చంద్రబాబును జైలుకి పంపారు
‘‘బీజేపీతో కలిసి వెళ్లిన పవన్ కళ్యాణ్‌ను ఆ పార్టీ నేతలు మోసం చేశారు. జగన్, బీజేపీ నేతలు కలిసే చంద్రబాబును జైలుకి పంపారు.ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని పవన్ కళ్యాణ్ వదిలేస్తే మంచిది. వైసీపీ నాయకులు ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రకటనలు చేస్తారు.సీఎం, మంత్రులు, ఎంపీలు అందరూ అబద్దాలు చెబుతున్నారు. ఏపీకి అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ బీజేపీ సంక నాకుతున్నారు. ఇంతకాలం నిద్రపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే ఎవరైనా నమ్ముతారా. జగన్ కనీసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇండియాలో అన్ని పార్టీ లు సమన్వయంతో పని చేయాలి. మోదీ నియంత పాలనకు చరమ గీతం పాడాలి’’ అని రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-12-03T22:39:06+05:30 IST