Gidugu Rudraraju: షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం
ABN, Publish Date - Dec 31 , 2023 | 06:00 PM
వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం నిర్వహించారు.
విజయవాడ: వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఆమెతో కలిసి పని చేసేందుకు మాకు అభ్యంతరం లేదు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు షర్మిల రాక ఆధారపడి ఉంటుంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారు.భయపెట్టి, బెదిరించే ధోరణలో జగన్ తీరు ఉంది. సమస్యలను పరిష్కరించాలంటే.. తొలగిస్తామని కాంట్రాక్టు సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అనేది వాస్తవం. మోదీ నియంతృత్వ పాలనను, ఏపీకీ అన్యాయం చేసినా.. వారు ఎందుకు మాట్లాడటం లేదు’’ అని గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు.
Updated Date - Dec 31 , 2023 | 06:00 PM