ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: కొలికపూడి కుటుంబ సభ్యులను సీఐడీ భయబ్రాంతులకు గురిచేసింది

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:07 PM

అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ( Kolikapudi Srinivasa Rao ) హైదరాబాద్‌లోని నివాసానికి విజిటర్స్‌గా వచ్చిన ఏపీ సీఐడీ నానా భీభత్సం సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న కొలికపూడి పట్ల జగన్‌రెడ్డి వేధింపులు దుర్మార్గమని అచ్చెన్నాయుడు చెప్పారు.

అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ( Kolikapudi Srinivasa Rao ) హైదరాబాద్‌లోని నివాసానికి విజిటర్స్‌గా వచ్చిన ఏపీ సీఐడీ ( AP CID ) నానా భీభత్సం సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న కొలికపూడి పట్ల జగన్‌రెడ్డి వేధింపులు దుర్మార్గమని చెప్పారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను సీఐడీ భయబ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. 11 ఏళ్ల పాపకు నోటీసులిస్తామని బెదిరించడం అమానవీయమన్నారు. నియంతలు పాలిస్తున్న దేశాల్లో కూడా ఇంతటి క్రూరత్వం లేదని చెప్పారు. కొలికపూడి చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు, జగన్‌రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా అని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్మోహన్‌రెడ్డిని ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని చూసి జగన్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మరో వందరోజుల్లో జగన్‌రెడ్డిని ప్రజలు తరిమివేయడం ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - Dec 31 , 2023 | 04:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising