ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP CID: కొలికపూడి అరెస్ట్..? హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఐడీ

ABN, Publish Date - Dec 30 , 2023 | 04:13 PM

ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ ( Kolikapudi Srinivas Rao ) ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ( AP CID ) ప్రత్యేక బృందం హైదరాబాద్‌కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్నది. కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేరని తన సతీమణి చెప్పినా వినడం లేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ ( Kolikapudi Srinivas Rao ) ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ( AP CID ) ప్రత్యేక బృందం హైదరాబాద్‌కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్నది. కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేరని కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ సతీమణి చెప్పినా వినడం లేదు.


కొలికపూడి భార్య అప్పటికే ఆఫీసుకు వెళ్లింది. అయితే ఆమెని తన ఇంటికి రావాలని, కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సీఐడీ అధికారులు ఆమెను ఒత్తిడి చేశారు. తన ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారని తాను చెప్పినా కూడా సీఐడీ అధికారులు వినలేదని ఆందోళన వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి ఎలాగైనా వెళ్లాలని సీఐడీ బృందం ప్రయత్నిస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా అపార్ట్‌మెంట్‌ ఫ్లోర్‌లోకి వచ్చి సీఐడీ బృందం కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ కోసం వేచి చూస్తోంది. ఈ రోజు ఎలాగైనా ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


కొలికపూడి ఏమన్నారంటే...

‘‘ఆంధ్రప్రదేశ్ అనే సమాజానికి, పంటకు పట్టిన చీడ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Verma ). ఆయన తల నరికి ఎవరైనా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా’’ అంటూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ న్యూస్ చానల్ డిబేట్‌లో ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ డీజీపీని రెండు రోజుల క్రితం కలిసి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. కాగా ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం' ( Vyooham ) చిత్రం విడుదల సమయంలో కొలికపూడి శ్రీనివాసరావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Dec 30 , 2023 | 04:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising