Kollu Ravindra: జగన్ కళ్లు క్రీడాశాఖ నిధులపై పడ్డాయి
ABN, First Publish Date - 2023-10-10T17:04:13+05:30
జగన్ కళ్లు ఇప్పుడు క్రీడాశాఖ నిధులపై పడ్డాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఆరోపించారు.
అమరావతి: జగన్ కళ్లు ఇప్పుడు క్రీడాశాఖ నిధులపై పడ్డాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సామాజిక బస్సుయాత్రలు చేసే ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీల సబ్ ప్లాన్ నిధులు రూ.1,14,000కోట్లు ఏమయ్యాయో జగన్ చెప్పాలి. నాలుగున్నరేళ్లుగా ప్రజలను నాసిరకం మద్యానికి బానిసలను చేసి, వారి ఇళ్లు.. ఒళ్లును జగన్‌రెడ్డి గుల్ల చేశారు. ఇప్పుడు వారిని ‘‘జగనన్న సురక్ష’’తో కాపాడతాడా? 40 వేల మంది కల్తీమద్యం వల్ల చనిపోయాక.. జగన్‌కు పేదల ఆరోగ్యం గుర్తొచ్చిందా? ఆరోగ్యశ్రీతో దండుకుంటున్నది చాలకే.. ‘‘జగనన్న సురక్ష పథకం’’ తీసుకొచ్చాడు. ‘‘ఏపీ నీడ్స్ జగన్ కాదు... ఏపీ హేట్స్ జగన్’’. ఇదే ప్రజలందరి మాట. వేలాదిమందిపై అక్రమ కేసులు పెట్టి... అన్యాయంగా ప్రజా నాయకుడిని జైలుకు పంపినందుకు మరలా జగన్ రాష్ట్రానికి కావాలా? దళితులను చంపిన నిందితులను అందలం ఎక్కిస్తున్నందుకు జగన్ రాష్ట్రానికి కావాలా? నాలుగేళ్లుగా క్రీడలను, క్రీడాకారులను పట్టించుకోని జగన్.. నేడు క్రీడాశాఖలోని నిధులను కాజేయడానికే ఆడదాం..పాడదాం అంటున్నాడు’’ అని కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-10T17:04:13+05:30 IST