MP Raghurama: చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-09-11T19:26:04+05:30
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు,. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)అరెస్ట్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు,. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)అరెస్ట్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం నాడు రఘురామ మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో(Rajahmundry Jail) ప్రాణహాని ఉంది. పథకం ప్రకారం చేస్తుంటారు..చంద్రబాబు ప్రాణంకు రిస్కు ఉంది.జైల్లో ఆయనను ఉంచడం సరికాదు. చంద్రబాబుకు హౌజ్అరెస్ట్ ఇవ్వరు. హైకోర్టులో కూడా బెయిల్ రాదు అని నేను అనుకుంటున్న.సుప్రీంకోర్టుకు రావడం ఉత్తమం.సుప్రీంకోర్టులో న్యాయ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై దేశంలో ఉన్న సీఎం లకు లేఖ ద్వారా వివరిస్తా. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తానుఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తోంది. వివేకా రెడ్డి హత్య కేసులో వైసీపీ నేత అవినాష్‌రెడ్డికి బెయిల్ రద్దు తథ్యం.అవినాష్ బెయిల్ రద్దు అయి..మరో రెండు పేర్లు కూడా యాడ్ అవుతాయి. రాష్ట్రంలో నరమోధం జరుగుతోంది.13వ తేదీన జగన్ ఢిల్లీకి రావొచ్చు... చంద్రబాబుకు ఉన్న ఎన్ఎస్‌జీ సెక్యూరిటీని తీసేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగొచ్చు.రాజమండ్రి జైల్ ముందు ఎస్పీ ...ఇదంతా ముందస్తు చుపా లేక ముందే తెలుసా ?. జూనియర్ ఐఏఎస్‌ను తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీని చేస్తే ఇతర ఐఏఎస్ లు ఎందుకు మాట్లాడడం లేదు. అన్ని కడప జిల్లా వారికేనా .. ఐఏఎస్ అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంలో రిమాండ్ తీర్పు చూస్తే జాలేస్తుంది. న్యాయవ్యవస్థను మనం అనడం కూడా సరికాదు.గవర్నర్‌కి సమాచారం లేదు. గతంలో నన్ను పుట్టిన రోజు నాడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబును పెళ్లి రోజునే అరెస్ట్ చేశారు. 2లక్షల అరవై వేల మంది స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ట్రైనింగ్ అయ్యారు.ఇంత మందికి ట్రైనింగ్ ఇస్తే కనీసం 3 వేల కోట్లు అవుతుంది.కొందరు ఐఏఎస్‌లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ తరుపున ఉన్న న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడారు. చంద్రనాయుడు మాజీ సీఎం ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారు. సీఎం హోదాలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేయడం లేదా ?మా పార్టీకి ఎక్స్‌పైరి డేట్ అయిపోయింది. అవినీతి కేసులో ఏసీబీ అధికారులు ఉండాలి, సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..సజ్జల రామకృష్ణారెడ్డి తన వ్యాఖ్యలను విరమించుకోవాలి. ఉద్యోగస్తుడు ఉద్యోగిగా మాట్లాడాలి. సాయిరెడ్డికి పది జన్మల శిక్షలు వేయాలి.మొన్ననే జగన్ కొడితే చంద్రబాబు దగ్గరికి వెళ్లవా. సజ్జల ,సాయిరెడ్డి మనుషులుగా బతకాలి’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
Updated Date - 2023-09-11T19:27:11+05:30 IST