ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nadendla Manohar: 144సెక్షన్ ఆ నేతలకు వర్తించదా..?

ABN, First Publish Date - 2023-09-11T20:14:42+05:30

వైసీపీ పార్టీకి(YCP party) వర్తించని 144 సెక్షన్.. ఇతర పార్టీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్‌(Chandrababu Naidu arrested)కు నిరసనగా టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది.

అమరావతి: వైసీపీ పార్టీకి(YCP party) వర్తించని 144 సెక్షన్.. ఇతర పార్టీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తోందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్‌(Chandrababu Naidu arrested)కు నిరసనగా టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు జనసేన మద్దతు ఇచ్చింది. ఈ బంద్‌లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఆరు నెలలు ఓపిక పట్టండి.. తప్పకుండా జగన్ ఈసారి ఇంటికి వెళ్తారు. మా అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆదేశాలతో ప్రతి జిల్లాలో శాంతియుతంగా మా పార్టీ నేతలు నిరసనలు తెలిపారు.చాలా ప్రాంతాలల్లో మా నాయకులను నిర్భందించారు.కొన్ని చోట్ల బెదిరింపులకు దిగారు.. అరెస్టులు కూడా చేశారు.జగన్ ప్రభుత్వం వ్యవస్థలను దుర్మార్గంగా ఉపయోగిస్తోంది. వ్యక్తులపై ఆధారపడి పని చేయొద్దని పోలీసులకు విజ్ఞప్తి.కుట్రపూరితంగా ఆస్తులను పెంచుకునేందుకు వైసీపీ నేతలు భూకబ్జాలు, అవీనితికి పాల్పడుతున్నారు.

అలాంటి వ్యక్తులకు పోలీసులు కాపాలా కాయాల్సి రావడం బాధాకరం. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్‌రెడ్డి కోర్టులో వాదించారు.న్యాయవాదులను అడ్డం పెట్టుకుని పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తూ జగన్‌రెడ్డి విచారణకు హాజరు కారు.చంద్రబాబు అరెస్టు వెనుక కుట్రతో రాజకీయ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.ప్రశాంతంగా ఉండే ఏపీలో అలజడి సృష్టిస్తున్నారు. పోలీసు శాఖ ఇలాంటి అంశాలల్లో సమర్ధించుకోవడం దురదృష్టకరం.గుంటూరులో నిరసన తెలిపిన మా జనసేన నాయకులను స్టేషన్‌కు తీసుకొచ్చారు.స్వచ్ఛందంగా షాపులు మూసి వేస్తే.. అక్కడ మేయర్, వైసీపీ నేతలు బెదిరించి మరీ తీయించారు.అంతమంది మూకుమ్మడిగా రోడ్లపైకి వస్తే 144సెక్షన్ వాళ్లకి వర్తించదా. గుడివాడలో ఓ వ్యక్తిపై సబ్ ఇన్స్‌పెక్టర్ దాడి చేసిన ఘటన అందరూ చూశారు.

పోలీసులు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. పోలీసులే భయపడి పని చేస్తే.. ఇక ప్రజలకు ధైర్యం ఎలా ఉంటుంది.పవన్ కళ్యాణ్ నిలబడిన తీరుకు మా పార్టీ నాయకులంతా గర్వపడుతున్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలి.ప్రజలు ధైర్యంగా పోరాడాలి... జనసేన అండగా ఉంటుంది. పార్టీ కోసం కాదు.. మన పిల్లల భవిష్యత్ కోసం అందరూ ఆలోచించండి.ప్రజలను భయ పెట్టి అయినా ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. వైసీపీ నాయకులు లైన్ దాటి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ విమానానికి అనుమతి ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. జగన్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అందరూ అర్ధం చేసుకోవాలి.ఇది వేరే దేశమా... పాస్‌పోర్టు, వీసాలు తెస్తేనే అనుమతిస్తారా.ఇటువంటి అరాచక పాలనను తరిమి కొట్టాలి.. జగన్‌కు బుద్ది చెప్పాలి. జీ 20 సదస్సు మన దేశంలో జరుగుతుండటం గొప్ప విషయం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బల పరచాల్సిన సందర్భంలో మన రాష్ట్రంలో జరిగిన ఘటనలు, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల వాటిని హైలెట్ చేసుకోలేక పోయాం’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-11T23:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising