ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh : విద్యార్థుల ఫీజు బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి

ABN, First Publish Date - 2023-11-16T21:16:38+05:30

విద్యార్థుల ఫీజు బ‌కాయిలు రూ.1650 కోట్లు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) జగన్ ప్రభుత్వాన్ని ( Jagan Govt ) డిమాండ్ చేశారు.

అమరావతి : విద్యార్థుల ఫీజు బ‌కాయిలు రూ.1650 కోట్లు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) జగన్ ప్రభుత్వాన్ని ( Jagan Govt ) డిమాండ్ చేశారు. గురువారం నాడు ఈ సమస్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి నారా లోకేష్ ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఏం పేర్కొన్నారంటే...‘‘కాలేజీలు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా విద్యార్థులను జగన్‌రెడ్డి ఇబ్బందుల‌కి గురిచేస్తున్నారు. విద్యాసంవ‌త్స‌రం పూర్తిచేసుకున్న‌వారికి స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డంలేదు. కొత్త‌గా విద్యార్థి, త‌ల్లి జాయింట్ అక్కౌంటు మెలిక‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజుల బ‌కాయిలు పెట్టి విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడొద్దు. విద్యార్థుల ఫీజు బ‌కాయిలు రూ.1650 కోట్లు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి. విద్యాసంవ‌త్స‌రం మొద‌లై నెలలు గ‌డుస్తున్నా విద్యార్థుల ఫీజు బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో వారి భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు పెండింగ్‌లో ఉంచ‌డంతో కాలేజీల యాజ‌మాన్యాలు విద్యార్థుల‌ని ప‌రీక్ష‌లు రాయ‌నీయ‌డంలేదు. చ‌దువు పూర్త‌యిన విద్యార్థుల‌కు మార్కుల‌ లిస్టులు, ఇత‌ర స‌ర్టిఫికెట్లు జారీని నిలిపేశాయి. పై చ‌దువులు, ఉద్యోగ ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల‌కి హాజ‌ర‌య్యే విద్యార్థులు స‌ర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

డిగ్రీ మ‌ధ్య‌లో ఉన్న విద్యార్థులు ప‌రీక్ష‌లకి దూరం అవుతున్నారు. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల ఆందోళ‌న‌లను దృష్టిలో ఉంచుకుని త‌క్ష‌ణ‌మే ఫీజు బకాయిలు విడుద‌ల చేయాలి. 2020-21 బ‌కాయి రూ.600 కోట్లను చెల్లించేది లేద‌ని తేల్చేసిన మీ స‌ర్కారు, 2022-23లో నాలుగో టెర్మ్ ఫీజులు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. నాలుగేళ్లుగా పీజీ కోర్సుల బ‌కాయిలు రూ.450 కోట్లు పెండింగ్‌లో ఉంది. టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో పీజీ కోర్సులకి ఫీజులు చెల్లించగా, మీరు వ‌చ్చాక నిలిపేశారు. విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమ‌లు చేస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్న మీరు ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఏడాదీ సకాలంలో విద్యార్థుల ఫీజురీయింబ‌ర్స్ మెంట్ చేయ‌లేదు. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడితో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్నారు. ఫీజులు క‌ట్ట‌లేద‌ని కొన్ని కాలేజీలు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా విద్యార్థులను ఇబ్బందుల‌కి గురిచేస్తున్నాయి. కేంద్రం ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల‌కి ఇస్తున్న 60 శాతం ఫీజు ఏ లెక్క‌లోనూ చూప‌కుండా మీరే విద్యాదీవెన ఇస్తున్న‌ట్టు ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్త‌గా విద్యా దీవెన డబ్బులను విద్యార్ధి, వాళ్ల తల్లి జాయింట్ అక్కౌంటులో వేస్తామంటూ మెలిక పెట్ట‌డం విద్యార్థులను మ‌రింతగా ఇబ్బందులు పెడుతుంది. విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన అంటూ పేర్లు పెట్టి, విప‌రీతంగా ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్పించి వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు జ‌రిగిన మేలు శూన్యం. మొండివైఖ‌రి, ప్ర‌చారార్భాటాలు మాని అర్జంటుగా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పాత బ‌కాయిలు, ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రం ఫీజులు చెల్లించాల‌ని కోరుతున్నాను’’ అని నారా లోకేష్ లేఖలో తెలిపారు.

Updated Date - 2023-11-16T21:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising