Atchannaidu: జనసేనతో కలిసి టీడీపీ 160 సీట్లు సాధించబోతున్నాం
ABN, First Publish Date - 2023-10-21T15:39:46+05:30
టీడీపీకి (TDP) తోడుగా జనసేన ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. టీడీపీ విస్తృత స్థాయీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కరెక్ట్ టైంలో మంచి హృదయంతో టీడీపీతో పవన్
అమరావతి: టీడీపీకి (TDP) తోడుగా జనసేన ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. టీడీపీ విస్తృత స్థాయీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కరెక్ట్ టైంలో మంచి హృదయంతో టీడీపీతో పవన్ పొత్తు ప్రకటించారు. ఏదైనా జనసేనతోనే కలిసే వెళ్లాలి. చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్‌కు టీడీపీ విస్తృత స్థాయీ సమావేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. ఎల్లుండి జనసేనతో సమావేశం ఉంది. భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తాం. కరవు వల్ల రైతులు తెగ ఇబ్బంది పడుతున్నారు. కరవుతో అల్లాడుతోన్న రైతులను పలకరిద్దాం.. ఎండిన పంటలను పరిశీలిద్దాం. జనసేనతో (Janasena) కలిసి ఈ పోరాటం చేపడదాం. 160 స్థానాలతో టీడీపీ - జనసేన అధికారంలోకి రాబోతున్నాం.’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
బెదిరింపులకు భయపడం..
‘‘చంద్రబాబును (Chandrababu) అరెస్ట్ చేసి భయపెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఇలాంటి బెదిరింపులకు భయపడదు. ఏపీకి జగన్ (Cm jagan) శనిలా పట్టారు. ఏపీకి పట్టిన శని ఎప్పుడు వదులుతుందా..? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. లోకేష్ (Nara lokesh) యువగళం యాత్ర ద్వారా ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడుతోంది. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేలా ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా.. ప్రజలే నడిపించారు. పులివెందుల్లో కూడా లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వ నాశనం చేశారు.. ఇవే ప్రజలకు నేరుగా వివరించారు. జగన్‌కు పిచ్చి ముదిరింది. చంద్రబాబును అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తారట. మూడు వేల కోట్ల అవినీతి అంటూ ఇప్పుడు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సుప్రీం కోర్టులో సరైన వాదనలు వినిపించేందుకు సరైన అడ్వకేట్లను పెట్టలేదు. కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా గంటకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అడ్వకేట్లను పెట్టారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెడితే సంఘీభావం తెలిపారు.. కానీ జగన్ జైలుకెళ్తే ఇంట్లో కుక్క కూడా మొరగలేదు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహిళలు.. యువకులు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. యువతకు మేలు చేకూరేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తే.. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా..?, చంద్రబాబు జైలుకెళ్లినా పోరాడాలి. ఎన్నికలకు సిద్దం కావాలి.’’ అని పిలుపునిచ్చారు.
వైసీపీకి అభ్యర్థులే లేరు..
‘‘వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. చంద్రబాబు అరెస్టయ్యారు కాబట్టి.. టీడీపీ నేతలు అదే పని మీద ఉంటారని జగన్ ప్లాన్ వేశారు. చంద్రబాబు కోసం పోరాడుతూనే ప్రభుత్వ అరాచకాలను వివరించాలి. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారు. టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు.. దొంగ ఓట్లను చేరుస్తున్నారు. భర్త జైల్లో ఉంటే భార్య ఎంతో బాధపడుతుంది. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. బాబు కోసం.. భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రోగ్రాంలు, ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్, బాదుడే బాదుడు కార్యక్రమాలు చేపట్టాలి. మా శ్రీకాకుళం నుంచి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ సైకిల్ యాత్ర చేస్తోంటే చొక్కాలిప్పిస్తారా...?, పసుపు చొక్కా కనబడకూడదంటారా..?, పెద్దిరెడ్డి ఖబడ్దార్..!, వడ్డీకి.. చక్ర వడ్డీతో మొత్తం తిరిగి చెల్లిస్తాం.’’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Updated Date - 2023-10-21T15:39:46+05:30 IST