కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buddha venkanna: ఏపీలో శాంతిభద్రతలు అల్లకల్లోలం అయ్యాయి

ABN, First Publish Date - 2023-07-21T16:40:27+05:30

ఏపీలో శాంతి భద్రతలు అల్లకల్లోలం అయ్యాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. నరసరావుపేటలో టీడీపీ నేతల బృందం పర్యటించింది. టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‌ను కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.

Buddha venkanna: ఏపీలో శాంతిభద్రతలు అల్లకల్లోలం అయ్యాయి

పల్నాడు: ఏపీలో శాంతి భద్రతలు అల్లకల్లోలం అయ్యాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha venkanna) అన్నారు. నరసరావుపేటలో టీడీపీ నేతల బృందం పర్యటించింది. టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‌ను కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్నమాట్లాడారు. ‘‘జడా శ్రీనివాసరావు ఐపీ పెడితే బాధితులు చదలవాడ దగ్గరకు వచ్చారు. అరవింద్, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గుండాలతో వచ్చి దాడి చేశారు. టీడీపీపై దాడులు జరిగితే వైసీపీ వాళ్లను వదిలివేసి బాధితులపై కేసులు పెట్టారు. చల్లా సుబ్బారావుపై పీడీ యాక్ట్ పెడతామంటున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను బాధ పెట్టిన వ్యక్తి సీఎం జగన్.’’ అంటూ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.

కొల్లు రవీంద్ర కామెంట్స్..

‘‘నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి దగ్గర ఉండి టీడీపీ శ్రేణులపై దాడి చేశారు. జడా శ్రీనివాసరావు ఐపీ పెట్టి పరారయ్యారు. జడా శ్రీనివాసరావు ఇంటిని ఆక్రమించడానికి ఎమ్మెల్యే, అతని అనుచరులు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే అక్రమ వ్యాపారాలు, భూకబ్జా విషయాలు బయటపెడితే దాడులు చేశారు. ఎవరు మాట్లాడితే వాళ్ల మీద కేసులు పడుతున్నారు.’’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

ప్రత్తిపాటి పుల్లారావు..

‘‘ఎస్పీ రవి శంకర్ రెడ్డి బాధితుల మీద కేసులు పెట్టడం దుర్మార్గం. ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమాలు ప్రశ్నించారని చల్లా సుబ్బారావుపై 28 కేసులు పెట్టారు. పల్నాడులో అధికార దుర్వినియోగం చేసి కేసులతో వేధిస్తూన్నారు. చిలకలూరిపేటకు చెందిన మంత్రి అభివృద్ధి చేయరు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే హల్‌చల్ చేస్తారు. నాగార్జున సాగర్‌లో నీళ్లు ఉన్న చిలకలూరిపేట, వినుకొండలో మాత్రం తాగటానికి నీళ్లు ఇవ్వలేదు.‌’’ అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

Updated Date - 2023-07-21T16:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising