Varla Ramaiah: జగన్‌రెడ్డి లండన్ వెళ్లేటప్పుడు చెప్పింది.. ఇదే కదా..!
ABN, First Publish Date - 2023-09-20T20:56:35+05:30
జగన్‌రెడ్డి(Jagan Reddy) లాంటి అవినీతి సామ్రాట్‌కు స్వస్తి పలికి, చంద్రబాబును స్వాగతం పలకాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.
అమరావతి: జగన్‌రెడ్డి(Jagan Reddy) లాంటి అవినీతి సామ్రాట్‌కు స్వస్తి పలికి, చంద్రబాబును స్వాగతం పలకాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ లండన్ వెళ్లే ముందు ‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను తిరిగొచ్చేలోపు చంద్రబాబు(Chandrababu) జైల్లో ఉండాల’’ని చెప్పలేదా..? చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టి.. జగన్ తాత్కాలిక ఉపశమనాన్ని పొందారు, వినాకశకాలే విపరీత బుద్ధి: అంటే ఇదే!. తాను 16 నెలలు జైల్లో ఉంటే చంద్రబాబును కూడా 16 రోజులైనా సెంట్రల్ జైల్లో ఉంచాలన్నదే జగన్ ధ్యేయం. లండన్ నుంచి గన్నవరం వచ్చాక గన్నవరంలో విమానం దిగి భూమిని ముద్దు పెట్టుకున్నది నిజం కాదా!చంద్రబాబును అరెస్టు చేసిన అధికారులను కౌగిలించుకొని నోట్లో స్వీట్లు కుక్కడం జగన్‌కు చంద్రబాబుపై ఎంత ద్వేషం ఉందో తెలుస్తోంది.
జగన్ అరెస్టు అయినప్పుడు జగన్ చెడు గురించి ప్రజలు పుంఖాను పుంఖానులుగా చెప్పుకున్నారు..చంద్రబాబు అక్రమ అరెస్టుపై అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సైబరాబాద్, హైటెక్ సిటీ (Cyberabad, hi-tech city)అభివృద్ధిని చంద్రబాబు చేశారని గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ మహిళా మంత్రి విడదల రజని కూడా చంద్రబాబు నాటిన మొక్కను నేను.. పెరిగి పెద్దై మీముందుకొచ్చానని జగన్‌తో చెప్పింది నిజంకాదా? మీ కేబినెట్‌లో ఉన్న ఓ మహిళా మంత్రి చంద్రబాబును అరెస్టు చేస్తే స్వీట్లు కుక్కుతూ పైశాచిక ఆనందం పొందింది నిజం కాదా?. ప్రజలు మిమ్మల్ని ఈసడించుకుంటున్నా, తప్పు పడుతున్నా మీలో మార్పు రావడంలేదు. ఒక క్రమపద్ధతిలో జీవితాన్ని సాగించే చంద్రబాబు జీవితాన్ని మీ కక్షా, కార్పణ్యాలతో అడ్డుకుంటున్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన మొదలు పెట్టినప్పటినుంచి జగన్, వైసీపీ నాయకులకు నిద్ర కరువైంది. 10 రోజులుగా సెంట్రల్ జైల్లో ఒంటరిగా, భయంగా, రాష్ట్రం ఏమైపోతోందని చంద్రబాబు ఆలోచిస్తుంటే, జగన్ రాక్షసానందం పొందుతున్నారు. ప్రజలు ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టి.. నీతివంతమైన పాలన కోసం చంద్రబాబును గెలిపించాలి. జగన్‌కు బుద్ధి చెప్పాలి. రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో, ఎవరు పరిపాలంచాలో నిర్ణయించేది ప్రజలే. మీరే న్యాయ నిర్ణేతలు న్యాయాన్ని కాపాడాలి’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
Updated Date - 2023-09-20T20:56:35+05:30 IST