జగన్ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలపై పెరిగిన వివక్ష
ABN , First Publish Date - 2023-06-30T23:15:01+05:30 IST
జగన్ ప్ర భుత్వంలో ఎస్సీఎస్టీలకు రక్షణ, గౌరవం లేదని, రోజురోజుకూ ఎస్సీ,ఎస్టీలంటే వివక్ష పెరిగిపోయిందని కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శించారు.

ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలి : కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి
ప్రొద్దుటూరు క్రైం, జూన్ 30: జగన్ ప్ర భుత్వంలో ఎస్సీఎస్టీలకు రక్షణ, గౌరవం లేదని, రోజురోజుకూ ఎస్సీ,ఎస్టీలంటే వివక్ష పెరిగిపోయిందని కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శించారు. ఎస్సీ,ఎస్టీలు చైతన్యవంతు లై ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైసీ పీ నాలుగేళ్ల పాలనలో ఎస్సీ,ఎస్టీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై 62 శాతం మేర దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని చెప్పారు. ఎస్సీఎస్టీలపై రోజుకు దాడి కేసులు 7, అత్యాచారాలు 4 లెక్కన కేసులు నమోదవుతున్నాయే తప్ప, శిక్షలు పడడం లేదన్నారు. 2వేల పైచిలుకు కేసులు నమోదైతే వీటిలో కనీసం 50 శాతం కూడా శిక్షలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ, చట్ట రీత్యా ఎస్సీ,ఎస్టీలకు అం దాల్సిన ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం అం దించడం లేదన్నారు. అంతటితో ఊరుకోకుండా ఎస్సీ,ఎస్టీల హక్కులను సైతం వైసీపీ వారు కాలరాస్తున్నారన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధి కోసం సబ్సిడీతో కూడిన రుణాలను అందించి ఆదుకుందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం రివర్స్ విధానాలతో భిన్నంగా వ్యవహరిస్తూ ఎస్సీ,ఎస్టీల కు అందాల్సిన ప్రయోజనాలను కూడా కాజేస్తుందన్నారు. టీడీపీ హయాంలో ఎస్సీ,ఎస్టీలకు ఉద్యోగ కల్పన కోసం స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేస్తే, సీఎం జగన్ రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయక దళితులకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నాడన్నా రు.
ఎస్సీ,ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీ పీ సర్కార్ వ్యవహరిస్తోందని, జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఎస్సీ,ఎస్టీలే కాకుం డా బీసీలు, అన్నివర్గాల వారు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. టీడీపీ నేతలు సుంకర వేణుగోపాల్, సీతారామిరెడ్డి టప్పాబాష, సిద్ద య్య, గుర్రప్పయాదవ్ తదితరులు పాల్గొన్నారు.