AP NEWS: మైనింగ్ పరిశ్రమలతో మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష
ABN, First Publish Date - 2023-11-18T21:14:58+05:30
నాపరాయి మైనింగ్ పరిశ్రమల పరిస్థితులపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ( Buggana Rajendranath Reddy ) సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
నంద్యాల : నాపరాయి మైనింగ్ పరిశ్రమల పరిస్థితులపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ( Buggana Rajendranath Reddy ) సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా నాపరాయి మైనింగ్ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై లీజుదారులు, పరిశ్రమల యజమానులతో ప్రధానంగా చర్చించారు. మైనింగ్ యజమానులు ఏమన్నారంటే.. జీవో-65 ప్రకారం 'డెడ్ రెంట్' కట్టడంలో గల ఇబ్బందులను నాపరాయి పరిశ్రమ యజమానులు మంత్రులకు వివరించారు. డెడ్ రెంట్ సంవత్సరంలో ఎప్పుడైనా కట్టే పాత పద్ధతిని మార్చి కొత్తగా ఏడాదిలో నాలుగు సార్లు కట్టడం వల్ల, రాయల్టీ నిధులు వెనక్కి పోతుండడాన్ని మైనింగ్ యజమానులు మంత్రులకు వివరించారు. నాపరాయి పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విన్నవించారు. సీఎఫ్ఓ, సీఎఫ్ఈ ప్రతి ఏడాది కొనసాగించడం లీజుదారులకు ఇబ్బందికరం, రెన్యువల్‌లా కాకుండా ఒకేసారి కట్టేలా ప్రభుత్వం సహకరించాలి. పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యంపై ఈసీ విధించే విషయంలోనూ ప్రభుత్వం సహకరించాలి. పరిశ్రమలకు అనుమతుల విషయంలో సరళమైన పాత విధానాలు అమలు చేయాలి. మార్బుల్, గ్రానైట్, కృత్రిమ రాళ్లు వచ్చిన నేపథ్యంలో నాపరాయి ప్రాధాన్యత తగ్గుతోందని పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-18T21:15:05+05:30 IST