ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kesineni Nani : టీడీపీ మహానాడుకు నాకు ఆహ్వానం లేదు : కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-06-08T12:36:53+05:30

ఎంపీ కేశినేని నాని నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులూ లేవన్నారు. కేంద్ర హోం మత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు కలయికపై తాను ఏమీ చెప్పలేనన్నారు. అభివృద్ధి విషయంలో ‌తాను పార్టీలు చూడబోనన్నారు. అందరినీ కలుపుకుని ప్రజల కోసం పని‌చేస్తానన్నారు. ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనన్నారు. తాను ఏదీ చేసినా మెచ్చుకునే వాళ్లు, తిట్టుకునే వాళ్లు ఉంటారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : ఎంపీ కేశినేని నాని నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు. తనకు ఎటువంటి పదవులూ లేవన్నారు. కేంద్ర హోం మత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు కలయికపై తాను ఏమీ చెప్పలేనన్నారు. అభివృద్ధి విషయంలో ‌తాను పార్టీలు చూడబోనన్నారు. అందరినీ కలుపుకుని ప్రజల కోసం పని‌చేస్తానన్నారు. ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనన్నారు. తాను ఏదీ చేసినా మెచ్చుకునే వాళ్లు, తిట్టుకునే వాళ్లు ఉంటారన్నారు. తాను రాజకీయాల్లో ఏం చేస్తాననే దాని పై తనకు స్పష్టత ఉందని కేశినేని నాని తెలిపారు.

నన్ను తిట్టినోళ్ల ఫొటోలు కూడా..

‘‘మోదీ, చంద్రబాబు, జగన్‌లను మంచిగా, చెడుగా చూసేవాళ్లు ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్లు ఏదో ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. ప్రజాప్రతినిధిగా గెలిచాక ప్రాంతం, ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తా. నా గురించి ఎవరేమి అనుకున్నా నేను పట్టించుకోను. ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలుస్తా అన్నాను. అంతిమంగా గెలుపోటమలు ప్రజలు నిర్ణయిస్తారు. నా పార్టీ కార్యాలయంపై బ్యానర్లు చూడండి. నన్ను తిట్టినోళ్ల ఫొటోలు కూడా నా ఫ్లెక్సీలో ఉన్నాయి. అసలు పార్టీలో ఇన్‌చార్జి లు ఎవరు...? వాళ్లంతా గొట్టంగాళ్లు. విజయవాడ ప్రజలంతా నాతో కంఫర్ట్ బుల్‌గా ఉన్నారు’’ అని కేశినేని నాని అన్నారు.

మహానాడుకు నాకు ఆహ్వానం లేదు..

‘‘టీడీపీ మాహానాడుకు నాకు ఆహ్వానం లేదు. నేను ఒక ఎంపీని... అక్కడ రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు పని లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు పెట్టారు. ఎంపీగా నాకు అసలు ఆహ్వానం లేదు.. మా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారు. పార్టీ కార్యాలయం పెట్టిన వ్యక్తి.. పొలిట్ బ్యూరో సభ్యుడైన నన్ను పిలవ లేదు. ఇన్‌చార్జిల పేరుతో హడావుడి చేసే వాళ్లు గొట్టంగాళ్లు. ఢిల్లీకి చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. బాధ్యతగా వెళ్లి మా అధినేతను కలిశాను. బీజేపీ, టీడీపీ పొత్తు పై స్పందించే స్థాయి నాది కాదు. నాకు ప్రజల్లో మంచి పేరు ఉంది కాబట్టే అన్ని పార్టీల్లో నా పేరుపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం నాకు పార్టీ మారే ఆలోచన లేదు.. చిర్రెత్తితే అప్పుడు ఆలోచిస్తా’’ అని కేశినాని నాని తెలిపారు.

Updated Date - 2023-06-08T12:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising