ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotamreddy : బావా కాకాణి.. మౌనంగా నిష్క్రమిద్దాం అనుకుంటే..

ABN, First Publish Date - 2023-02-04T10:41:43+05:30

ఏ పాము లేయకుంటే, ఏలిక పాము లేచినట్లు... మా ప్రియ బావ, మంత్రి కాకాణి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల... ఇలాంటి కాల్స్ చేయిస్తే, నెల్లూరు నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయి. సజ్జల... బోరుబడ్డ అనిల్... ఇలాంటి వాటికి బెదిరేవాడిని కాదు. తమ్ముడు భాస్కర్... తొడలు సినిమాల్లో కొడితే బాగుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మంత్రి కాకాణి (Minister Kakani)పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) మండిపడ్డారు. మంత్రులు, సలహాదారులపై ఫైర్ అయ్యారు. నేడు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబం (YS Family) గురించి మాట్లాడే అర్హత కాకాణికి లేదన్నారు. తానిప్పుడు వీర విధేయుడిని కానని కాకాణి ఆరోపించారన్నారు. ఆనంను కాకాణి ఎంత క్షోభ పెట్టారో జిల్లా అంతటికి తెలుసన్నారు.. మౌనంగా నిష్క్రమిద్దాం అనుకుంటే అందరూ తనపై విమర్శలు చేస్తున్నారని కోటంరెడ్డి వాపోయారు.

అందరికీ జవాబు ఇచ్చేందుకు మళ్లీ మీడియా ముందుకు వచ్చానని కోటంరెడ్డి వెల్లడించారు. రాజకీయ జీవితం ఇచ్చిన ఆనంపై నోరు పారేసుకోవడం సబబేనా? అని ప్రశ్నించారు. ఇంకా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ‘బావా కాకాణి.. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వైసీపీ (YCP)లో ఉండకూడదని నిర్ణయించుకున్నాకే.. టీడీపీ (TDP) వైపు మళ్లాను. బావా కాకాణి.. మాటకు మాట జవాబు ఇవ్వగలుగుతా. బావా కాకాణి.. నెల్లూరు కోర్టు (Nellore Court) చోరీ కేసులో అన్ని వేళ్లూ నీ వైపే చూపిస్తున్నాయి. ముందు ఆ కేసు సంగతి చూడు. నాపై కేసులు పెడతామని లీకులు ఇస్తున్నారు. కేసులతో భయపడతానని అనుకోవడం మీ అమాయకత్వం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. నా సంగతి వదిలెయ్. నెల్లూరు జిల్లాకు వచ్చిన సీబీఐ సంగతి చూసుకో. నాపై కిడ్నాప్ కేసు (Kidnap Case) కాదు.. మర్డర్ కేసు (Murder Case) కూడా పెట్టుకోండి’’ అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

ఆడియో కాల్స్ చేయిస్తే.. వీడియో కాల్స్ వస్తాయ్..

‘‘ఏ పాము లేయకుంటే, ఏలిక పాము లేచినట్లు... మా ప్రియ బావ, మంత్రి కాకాణి కూడా ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి వరకు నేను నీకు విధేయుడుని. బావా నిన్ను ఆనం జడ్పీ ఛైర్మన్ చేస్తే, నువ్వు విభేధించి ఉండకూడదు కదా? వైఎస్ కుటుంబం నుంచి గొప్పగా మాట్లాడే హక్కు నీకు ఎక్కడికి ఉంది. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఎన్నిసార్లు నీతో కూర్చొన్నాం. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటాది, జగన్ ఓ నీటిబొట్టు అన్నది వాస్తవమా? కాదా? పొదలకూరులో వైఎస్ విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అడ్డుకున్న మీరు మాట్లాడుతుంటే బాధేస్తుంది. చంద్రబాబు నాయుడు కాళ్లకి దణ్నం పెట్టింది నువ్వా? కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి పేరొచ్చే సరికి, ఆరోపణలు ఎక్కువయ్యాయి. నిన్న బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసి దుర్భాషలాడుతూ బెదిరించారు. కొట్టుకుంటా... కొట్టుకుంటా.. తీసుకువెళతాడట. విచారిస్తే... సజ్జల కోటరీ అంట. సజ్జల... ఇలాంటి కాల్స్ చేయిస్తే, నెల్లూరు నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయి. సజ్జల... బోరుబడ్డ అనిల్... ఇలాంటి వాటికి బెదిరేవాడిని కాదు’’ అని పేర్కొన్నారు.

తమ్ముడు భాస్కర్.. తొడలు సినిమాల్లో కొడితే బాగుంటాయ్..

తమ్ముడు భాస్కర్... తొడలు సినిమాల్లో కొడితే బాగుంటాయి. రెండు రోజులు కిందట నీ వెంటే ఉంటానన్నాడు. కొంత మంది నా దగ్గరకొచ్చి బిల్లులు రావాల్సి ఉందని చెప్పారు. 26 డివిజన్లలో ఎన్నికలు జరిగితే, 22వ డివిజన్ ని ప్రత్యేకంగా చూశాం. కారు దగ్గరకి వచ్చాడు.. బాధగా ఉందిని హత్తుకుని ఏడ్చేశాడు. గంట తరువాత కేసులు పెట్టారు. ఇరుకళలమ్మ జాతర నలభై ఏళ్ల తరువాత నిర్వహించబోతున్నాం. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా జాతర నిర్వహించి తీరుతాం.

Updated Date - 2023-02-04T11:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising