Senior NTR: ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం...
ABN , First Publish Date - 2023-02-15T11:54:35+05:30 IST
హైదరాబాద్: నందమూరి తారకరామారావు (Nandamuri Tarakara Rao)కు అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ (NTR) బొమ్మతో రూ.100 కాయిన్‌ను ఆవిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది.
హైదరాబాద్: నందమూరి తారకరామారావు (Nandamuri Tarakara Rao)కు అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ (NTR) బొమ్మతో రూ.100 కాయిన్ (Rs. 100 Coin )ను ఆవిష్కరించాలని కేంద్రం (Central) నిర్ణయించింది. పూర్తిగా వెండి (Silver)తో ఈ నాణెంను తయారు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా మింట్ అధికారులు (Mint Officials) నమూనాతో దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari)ని కలిశారు. దీనిపై సలహాలు, సూచనలు పురందేశ్వరి అడిగి తెలుసుకున్నారు.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన నందమూరి తారకరామారావుకు అరుదైన దక్కింది. కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తున్న నాణేలు పూర్తిగా వెండితో రూపొందించే వంద రూపాయల కాయిన్‌పై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాను ఎన్టీయార్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరికి నిన్న మింట్ అధికారులు చూపించారు.
గత రాత్రి మింట్ అధికారులు పురందేశ్వరి నివాసంలో కలిసి కాయిన్‌పై ఎన్టీఆర్ బొమ్మ ఎలాంటిది
పెడితే బాగుంటుంది.. ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ వంద నాణెం చలామణిలో ఉండదన్నారు. ఎవరికైనా గిఫ్టుగా ఇచ్చేందుకు ఈ కాయిన్‌ను కొనుగోలు చేయవచ్చు. వంద, ఐదు వందలు, వెయ్యి కాయిన్స్ ఒక ప్యాకెట్ రూపంలో ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బహుమతిగా ఇచ్చేందుకు అవకాశముంటుంది. ఈ ప్యాకెట్ మొత్తం కొనుగోలు చేసేవారికి ఒక బ్రోచర్ కూడా ఇస్తారు. ఆ బ్రోచర్‌లో ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ కాయిన్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నాణేలను నెల రోజులలో రూపొందించి మార్కెట్‌లో విడుదల చేసే అవకాశముంది.