AP News: జగన్ సర్కార్‌కు మరో షాక్..!

ABN , First Publish Date - 2023-03-21T16:28:24+05:30 IST

అమరావతి: జగన్ సర్కార్ (Jagan Govt.) కు సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు (CPS Employees) మరో షాక్ (Shock) ఇవ్వనున్నారు.

AP News: జగన్ సర్కార్‌కు మరో షాక్..!

అమరావతి: జగన్ సర్కార్ (Jagan Govt.) కు సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు (CPS Employees) మరో షాక్ (Shock) ఇవ్వనున్నారు. ఈనెల 23న సీఎస్, ఆర్థిక కార్యదర్శికి వినతిపత్రం (Petition) ఇవ్వాలని ఈ మేరకు నిర్ణయించారు. గురువారం (23వ తేదీ) సీపీఎస్ ఉద్యోగులందరూ.. తమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 లక్షల సీపీఎస్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఈ ఏడాది జీతంలో 10 శాతం మినహాయించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ వాటాతో కలిపి.. ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు ప్రభుత్వం జమచేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 90 శాతం జీతం ఇచ్చి... ఐటీ (IT) మాత్రం మొత్తం జీతానికి ఎలా వసూలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-03-21T16:28:24+05:30 IST