ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI Ramakrishna: మోదీ, జగన్ ప్రభుత్వాలను సాగనంపడమే లక్ష్యం

ABN, First Publish Date - 2023-09-30T17:13:58+05:30

పొత్తులపై సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) క్లారిటీ ఇచ్చారు. ‘‘కేంద్రంలో మోదీ (Pm modi), ఏపీలో జగన్ (Cm jagan) ప్రభుత్వాలను సాగనంపడం మా విధానం. మాతో కలిసి వచ్చే వారితో పొత్తులు పెట్టుకుంటాం. మోదీ, జగన్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. జగన్ దోపిడీ, అరాచకాలతో ప్రజలు విసిగి

విజయవాడ: పొత్తులపై సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) క్లారిటీ ఇచ్చారు. ‘‘కేంద్రంలో మోదీ (Pm modi), ఏపీలో జగన్ (Cm jagan) ప్రభుత్వాలను సాగనంపడం మా విధానం. మాతో కలిసి వచ్చే వారితో పొత్తులు పెట్టుకుంటాం. మోదీ, జగన్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. జగన్ దోపిడీ, అరాచకాలతో ప్రజలు విసిగి పోయారు. తెలంగాణ కంటే ఏపీ ఎంతో వెనుకబడి పోయి ఉంది. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన చేస్తున్నారు. అన్ని రంగాలను అంధకారంలోకి నెట్టారు. ఐటీ అనేది ఏపీలో లేకుండా చేశారు. జగన్‌కు కనీసం సిగ్గు కూడా లేదు. పోలవరం, పరిశ్రమలు, ఐటీ గురించి జగన్ మాట్లాడడం లేదు. రాష్ట్రం పురోగమనం కాకుండా తిరోగమనంలో తిరుగుతుంది. పోలీసులను అడ్డం పెట్టి అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాబట్టి... వాళ్లతో కలిసి పని చేసే ఆలోచన చేస్తున్నాం. జగన్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు మా వంతు కృషి చేస్తాం. మోదీ, అమిత్ షాల‌ ప్రమేయం లేకుండా చంద్రబాబును జైల్లో పెడతారా?, మోదీ, జగన్‌లు కలిసి దోచుకున్నారు.. ఇప్పుడు కలిసే చంద్రబాబును జైలుకు పంపారు. టీడీపీ, జనసేన కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్లు బీజేపీతో తెంచుకుని వస్తే మేము స్వాగతిస్తాం. బీజేపీతో వాళ్లు వెళితే.‌‌. జగన్ నెత్తిన పాలు పోసినట్లే. మోదీ సహకారం లేకుండా జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. దేశం, రాష్ట్రం బాగు పడాలంటే మోదీ, జగన్‌లను ఓడించాలి.’’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-30T17:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising