Bonda Uma: దమ్ముంటే చర్చకు రావాలి.. కొడాలి నానికి కౌంటర్
ABN, First Publish Date - 2023-09-27T22:21:02+05:30
ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ నేతలు దమ్ముంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ(Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ నేతలు దమ్ముంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ(Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ రింగు రోడ్డు ఎలైన్మెంట్ మార్పు అంటున్న వైసీపీ నాయకులు చూపించగలరా..? మంత్రి రోజా, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి మాట్లాడారో వాళ్లు వచ్చి ఆధారాలు చూపించండి. 1980 నుంచి లింగమనేని వాళ్లకు అక్కడ భూములు ఉన్నాయి. ల్యాండ్‌లో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లింది.
సింగపూర్ సంస్థ మాస్టర్ ప్లాన్, ఎలైన్మెంట్ ఇఛ్చింది. లింగమనేని రమేష్ అనేవాళ్లు వాళ్లకు తెలుసా. వీళ్ల ఆరోపణలే ఒక బోగస్, కేసే అక్రమం. అందులో మళ్లీ A14గా లోకేష్ పేరు చేరుస్తారా..? నాలుగున్నరేళ్లుగా ఈ అక్రమాలపై ఏం చేశారు. దొంగతనంగా, అక్రమంగా కేసులు పెట్టారు.ఇప్పుడు పెట్టేవన్నీ తప్పుడు కేసులని ప్రజలకు అర్థం అవుతోంది. కొడాలి నానికి అభివృద్ధి గురించి మాట్లాడు.. అనవసరంగా మాట్లాడితే పళ్లు రాల్తాయి జాగ్రత్త. మాకు సంస్కారం అడ్డు వస్తుంది.. నీకు దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడు... నీ మంత్రి పదవి ఎందుకు తీశారో చెప్పు. కొడాలి నాని మాటలకు అర్థం లేదు. ఏ విషయం మీద అయినా మేము చర్చకు సిద్ధం.. దమ్ముంటే చర్చకు రావాలి’’ అని బోండా ఉమా సవాల్ విసిరారు.
Updated Date - 2023-09-27T22:21:02+05:30 IST