ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma : ఏపీని జగన్ అథ:పాతాళంలోకి నెట్టేశాడు

ABN, First Publish Date - 2023-08-24T19:23:12+05:30

సంక్షేమం పేరుతో నాలుగేళ్లలో ప్రజలను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) నిట్టనిలువునా ముంచేసి అథ:పాతాళంలోకి నెట్టేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) అన్నారు.

అమరావతి: సంక్షేమం పేరుతో నాలుగేళ్లలో ప్రజలను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) నిట్టనిలువునా ముంచేసి అథ:పాతాళంలోకి నెట్టేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు(Bonda Umamaheswara Rao) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ఒకచేత్తో రూ.10ఇస్తూ, మరోచేత్తో రూ.100 లాక్కుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ రూ.7లక్షల కోట్లలో 20శాతం సొమ్ము సంక్షేమానికే వెచ్చించింది. జగన్‌రెడ్డి హాయాంలో బడ్జెట్ రూ.9.50లక్షల కోట్లకు చేరినా, సంక్షేమానికి 15శాతం కూడా ఖర్చు చేయలేదు. టీడీపీ హయాం(TDP GOVT)తో పోలిస్తే ఆదాయం పెరిగినా, లక్షలకోట్ల అప్పులు తెచ్చినా పేదలకు మాత్రం జగన్‌రెడ్డి మొండిచెయి చూపారు.జగన్, చంద్రబాబు(Chandrababu)ల్లో ఎవరు సంక్షేమానికి ఎక్కువ నిధులు వెచ్చించారనేది బడ్జెట్ లెక్కలు, సీ.ఎఫ్.ఎమ్.ఎస్, కాగ్ సమాచారమే చెబుతోంది. మోసకారీ సంక్షేమంతో కోతలరాయుడిగా మిగిలిన జగన్ పాలనలో నష్టపోని వర్గం లేదు. రైతుభరోసా పేరుతో రైతుల నోట్లో మట్టికొట్టారు. అమ్మఒడి, ఆసరా, చేయూత అని మహిళలను నమ్మించి, కల్తీ మద్యం విక్రయాలతో వారి పుస్తెలు తెంచుతున్నాడు.నిరుద్యోగ భృతి లేకుండా చేసి, ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవితను చిదిమేశారు. నాలుగేళ్లలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, పన్నుల భారం, ధరల పెరుగుదలతో ప్రజలపై లక్షలకోట్ల భారం మోపారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసగిస్తూ, రాష్ట్రాన్ని దోచేస్తూ, తన ఖజానా నింపుకుంటున్నారు’’ అని బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-24T19:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising