ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devineni Uma: జగన్‌రెడ్డి కృష్ణా జలాలను కేసీఆర్‌కు తాకట్టు పెట్టాడు

ABN, First Publish Date - 2023-10-05T21:14:12+05:30

2019 ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) దగ్గర డబ్బులు తెచ్చుకొని ఏపీ సీఎం జగన్‌రెడ్డి(CM JAGAN REDDY) కృష్ణా జలాలను తాకట్టు పెట్టాడని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఆరోపణలు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా(మైలవరం): 2019 ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) దగ్గర డబ్బులు తెచ్చుకొని ఏపీ సీఎం జగన్‌రెడ్డి(CM JAGAN REDDY) కృష్ణా జలాలను తాకట్టు పెట్టాడని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఆరోపణలు చేశారు. గురువారం నాడు మైలవరం పంచాయతీ కార్యాలయం కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కృష్ణా జలాలపై హక్కులను కాపాడాలని మైలవరంలో దేవినేని ఉమా నిరసన ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణా జలాలపై హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్, ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ..‘‘1500 వందల కోట్లు తెచ్చుకొని అఫెక్స్ కౌన్సిల్‌లో జగన్‌రెడ్డి నోరు తెరవలేదు. ఢిల్లీ వెళ్లిన జగన్‌రెడ్డి కృష్ణా జలాలు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో ఏం మాట్లాడాడో రైతంగానికి సమాధానం చెప్పాలి.

నాగార్జున సాగర్ నుంచి నీరు మన ప్రాంతానికి రాదు. జగన్ నిర్ణయంతో రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎడారిగా మారనున్నాయి. కృష్ణా జలాలు రాకపోతే రాయలసీమలో కరవు వచ్చే పరిస్థితి. రైతుల హక్కులను కాపాడే వరకు టీడీపీ పోరాటం చేస్తుంది. కృష్ణా జలాలు పంపిణీపై పున:సమీక్ష చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం మాట్లాడితే ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, సీఎం జగన్‌రెడ్డి నోరు మెదపలేదు. కృష్ణా జలాలు రాకపోతే కృష్ణా డెల్టా, సాగర్ కింద 35 లక్షల ఎకరాల సాగు ప్రశ్నర్థకంగా మారే ప్రమాదం ఉంది. వివేకానందారెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి పేరు లేకుండా చేయడానికి జగన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో లాలూచీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హక్కులను గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కర్ణాటక, తమిళనాడ్‌ రాష్ట్రాలకు తాకట్టు పెట్టాడు. చేతగాని వాడికి అధికారం ఇస్తే ప్రజల హక్కులను తాకట్టు పెడతారు అనే దానికి జగన్‌రెడ్డి నిదర్శనం’’ అని దేవినేని ఉమా మండిపడ్డారు.

Updated Date - 2023-10-05T21:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising