Devineni Uma: సైకో కళ్లలో ఆనందం కోసమే CID పనిచేస్తోంది
ABN, First Publish Date - 2023-09-11T22:51:00+05:30
సైకో జగన్మోహన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబును సీఐడీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా - మైలవరం: సైకో జగన్మోహన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబును సీఐడీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టిన చంద్రబాబును ఏం చేయలేదు.2021వ సంవత్సరంలోన నమోదైన కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో దేశం అంతా వ్యతిరేకం వ్యక్తం అవుతోంది.సీఐడీ అధికారులు పోస్టింగ్‌లకు కక్కుర్తి పడి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు. ఒక రాష్ట్రంను ఎలా అభివృద్ధి చేయాలో ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు. నాకు ఒక ఖైదీ నెంబర్ ఇచ్చారు, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఉమాలకు కూడా రావాలని మా మీద తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టించావు. ఇంతకన్నా మీరు ఏం చేయగలరు. ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖతంలో కలుపుతారు’’ అని దేవినేని ఉమా ధ్వజమెత్తారు.
కొడాలి నానిపై తీవ్ర ఆగ్రహం
కొడాలి నాని జగన్ చేతులను ఎలా ముద్దడతాడో ఇమిటేట్ చేసి చూపించారు. ‘‘కొడాలి నాని చంద్రబాబు అరెస్ట్‌పై అభ్యతరకరంగా మాట్లాడుతున్నాడు.చంద్రబాబు చలవతో రెండు సార్లు టీడీపీ బీ ఫారం తీసుకున్నావు. జగన్ దగ్గర నీ బతుకేంటో మా గన్నవరం వెంకట్రావు బాగా చెప్పాడు.జగన్ మెప్పు కోసం చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం గురించి మాట్లాడటం తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశావు.కొడాలి నాని వల్ల కృష్ణా జిల్లా ప్రతిష్టకు అవమానం జరిగింది. ఇంట్లో ఆడవాళ్లు గురించి నీకు ఎందుకు..? సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఒక పెద్ద పాలేరివి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుణపాఠం తప్పదు’’ అని దేవినేని ఉమా తీవ్రంగా హెచ్చరించారు.
Updated Date - 2023-09-11T22:51:00+05:30 IST