ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jalil Khan: 12లక్షల‌ కోట్లకు ఏపీ అప్పును జగన్‌రెడ్డి పెంచారు

ABN, First Publish Date - 2023-10-07T21:41:45+05:30

12లక్షల‌ కోట్లకు ఏపీ అప్పుని జగన్‌రెడ్డి పెంచారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) వ్యాఖ్యానించారు.

విజయవాడ: 12లక్షల‌ కోట్లకు ఏపీ అప్పుని జగన్‌రెడ్డి పెంచారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం నాడు వన్‌టౌన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాల నేతలు, వ్యాపారులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘నారా లోకేష్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లల్లో దీపాలు ఆపి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన తెలిపారు. ఈ చీకటి రాజ్యంలో వెలుగు అసాధ్యం అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు.

జగన్మోహన్‌రెడ్డి అధికారంలో అవినీతి, అక్రమాలు, భూ, దోపిడీ, అరెస్టులు ఉన్నాయి. అభివృద్ధి కోసం సీసిఎం జగన్మోహన్‌రెడ్డి కనీసం ఆలోచన చేయలేదు. ఆదాయం లేకుండా అప్పులతో ఎంత కాలం పాలన చేస్తారు. ప్రజలపై భారాలు మూడింతలు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు బతుకు దుర్భరంగా మార్చారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టాలని జగన్ కుట్ర పన్నాడు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. సీఐడీ అంటే జగన్మోహన్‌రెడ్డికి బానిసళ్లాగా మారారు. జగన్ చెప్పినట్లే వారు పని చేస్తున్నారు. ఇక వాళ్ల దర్యాప్తుని ఎవరైనా నమ్ముతారా..? రేపు ఎన్నికలల్లో వైసీపీ డక్ అవుట్ అవడం ఖాయం.జగన్మోహన్‌రెడ్డి నియంత పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’’ అని జలీల్‌ఖాన్ హెచ్చరించారు.

Updated Date - 2023-10-07T21:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising