Kollu Ravindra: 2024లో జగన్‌కు అభ్యర్థులు దొరకడం కష్టమే
ABN, First Publish Date - 2023-09-27T22:14:18+05:30
2024లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వైసీపీ అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనని.. టీడీపీ ప్రభంజనం మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర(Kollu Ravindra) వ్యాఖ్యానించారు.
కృష్ణాజిల్లా, (మచిలీపట్నం): 2024లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వైసీపీ అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనని.. టీడీపీ ప్రభంజనం మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర(Kollu Ravindra) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ ఏ తప్పు చేయని చంద్రబాబుని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును కస్టడీ పేరుతో రెండు రోజులుగా చాలా ఇబ్బంది పెట్టారు. ఏ ఆధారం లేకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబును జైలులో పెట్టి కక్ష సాధిస్తున్నారు. సుప్రీం కోర్టులో రిలీఫ్ వస్తుందని ఆశించాం. వారం రోజులు వాయిదా వేశారు. స్కిల్ స్కాం కేసులో చాలా మందికి బెయిల్ వచ్చింది. బెయిల్ కోసం చంద్రబాబు ఫైట్ చేసి ఉంటే రెండు రోజుల్లో బెయిల్ వచ్చేది. తప్పు చేయలేదు కాబట్టే క్యాష్ పిటీషన్ వేశాం.. పదేళ్ల పాటు బెయిల్ మీద ఉండవచ్చని జగన్ నిరూపించాడు.
43వేల కోట్లు ఆర్థిక నేరం కేసులో వాయిదాలకు హాజరవ్వకుండా తిరుగుతున్నాడు. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొలేక అక్రమ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత టీడీపీ క్యాడర్‌ని కూడా డీ గ్రేడ్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా జగన్ కక్ష సాధింపు చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పోలీసులు కేసులు పెడుతున్నా కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారు. చంద్రబాబు కోసం సామాన్య ప్రజలు సైతం రోడ్లెక్కి పోరాడుతున్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కుల ప్రస్థావన చేస్తుండటం సిగ్గుచేటు. వైసీపీ ఎత్తుగడ ఫెయిల్ అయ్యింది. CID చీఫ్ సంజయ్, పొన్నవోలు చంద్రశేఖరరెడ్డి బాధ్యత మరిచి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు’’ అని కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-27T22:14:18+05:30 IST