Minister Satyanarayana: కనక దుర్గమ్మ ఆలయంలో అభివృద్ధి పనులకు ప్రణాళికలు
ABN , First Publish Date - 2023-09-05T16:35:55+05:30 IST
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం( Vijayawada Kanaka Durgamma Temple) అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. మాస్టర్ ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు.. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) తెలిపారు.
విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం(
Vijayawada Kanaka Durgamma Temple) అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. మాస్టర్ ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు.. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Minister Satyanarayana) తెలిపారు. మంగళవారం నాడు దుర్గగుడిలో అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... .ప్రసాదం పోటు, అన్న దానం బిల్డింగ్, శివాలయం, రాక్ మిటిగేషన్, తదితర పనులు చేపడుతున్నాట్లు చెప్పారు. ప్రస్తుతం దుర్గమ్మ ఆలయం ఉన్న ఘాట్‌రోడ్డు వాస్తు ప్రకారం ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నైరుతి వైపు నుంచి రాకపోకలు ఉండకూడదనేది వాస్తు నిపుణుల అభిప్రాయం. రాజగోపురం వైపు నుంచే భక్తుల రాకపోకలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతమున్న క్యూ కాంప్లెక్సుకు అదనంగా మరో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతాం. క్యూ లైన్ల కోసం ర్యాంప్ ఏర్పాటు. కొత్త క్యూ కాంప్లెక్సులో కూడా ఉచిత, రూ. 100, 300, 500 కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం. రెండు అంతస్తుల్లో అన్నదానం ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నాం. అన్నదానం బిల్డింగ్‌పై నుంచి దర్శనం కోసం ఫ్లై ఓవర్ ఏర్పాట్లు చేస్తాం. ఈ నెలలోనే ఈ పనులు ప్రారంభిస్తాం. దుర్గ గుడిలో చేపట్టే అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. విజయవాడ దుర్గ గుడి, శ్రీశైలం(Srisailam)లో అభివృద్ధి పనులకు రూ. 400 కోట్ల అంచనాలతో ప్రణాళికలు రూపొందించాం. శ్రీ శైలంలో కూడా ప్రత్యేక క్యూ కాంప్లెక్సుల ఏర్పాటు. రూ. 40 కోట్లతో మండపాలు కడుతున్నామని మంత్రి సత్యనారాయణ తెలిపారు.