ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యేల సంచలన వ్యాఖ్యలు.. వారేమన్నారంటే...

ABN, First Publish Date - 2023-03-23T09:25:43+05:30

ఏపీలో ఈరోజు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఏపీలో ఈరోజు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA kota MLC Elections) జరుగనున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs)చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమతో వైసీపీ ఎమ్మెల్యే (YCP MLAs)లు టచ్‌లోనే ఉన్నారని.. టీడీపీ అభ్యర్థి విజయం ఖాయమని మీడియాతో ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. సీఎంపై అసంతృప్తితో ఉన్నారు కాబట్టే తమతో ఆ వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడుగురు వైసీపీ, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేతలు... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆత్మ ప్రబోధానుసారం టీడీపీకి ఓట్లు వేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), గోరంట్ల బుచ్చయ్య (Gorantla Buchaiah) వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు గ్రహించారు: నిమ్మల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తెలుగుదేశం చరిత్ర సృష్టిస్తుoదని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నిమ్మల రామానాయుడు అన్నారు. అంతరాత్మ ప్రభోదానుసారావు వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయబోతున్నారన్నారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోనే ఉన్నారని అన్నారు. పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైసీపీ మునిగిపోయే నావ అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రహించారన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఝలక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. సీక్రెట్ ఓటింగ్‌లో ఎవరు ఎవరికి వేశారో తెలిసే అవకాశమే లేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

బాధలో ఉన్నామని చెబుతున్నారు: గోరంట్ల

వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని... అందుకే అభద్రతా భావనలో జగన్ క్యాంపులు పెట్టుకున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారన్నారు. ‘‘బాధలో ఉన్నాం మీతో పంచుకుంటున్నాం అని మమ్మల్ని సంప్రదించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మేము ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. వారు అంతరాత్మప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ 16 మందిలో మూడు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే భవానీతో పాటు మరికొందరిని బెదిరిస్తున్నారని.. వారికున్న వ్యాపార సంస్థలపై దాడులు చేస్తామని బెదిరించారని గోరంట్ల వెల్లడించారు.

Updated Date - 2023-03-23T09:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising