Devineni Uma : టీడీపీ నేత దేవినేని ఉమా అరెస్ట్.. కారణమేంటంటే...?
ABN, First Publish Date - 2023-11-29T15:05:56+05:30
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమాలపై టీడీపీ ఆందోళన బాట పట్టింది. ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో దేవినేని ఉమా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఫెర్రీలో ఇసుక కుప్పలపై కూర్చుని దేవినేని ఉమా నిరసన తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమాలపై టీడీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో దేవినేని ఉమా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఫెర్రీలో ఇసుక కుప్పలపై కూర్చుని దేవినేని ఉమా నిరసన తెలిపారు. ఈ నిరసనలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చి మద్దతు తెలిపారు. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డికి వీడియో కాల్ చేసి దేవినేని ఉమా ఇసుకను చూపించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ దొంగలపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా.. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు టీడీపీ నేతలను వారించారు. నిరసనలో పాల్గొన్న దేవినేని ఉమాని, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇసుక దోపిడీని ఆపకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఏంటని పోలీసులపై ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే ప్రశ్నిస్తున్నటీడీపీ నేతల నోరు నొక్కాలని చూస్తున్నారని దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి తమను అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక ఆక్రమ రవాణా అవుతున్న వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఆందోళనను విరమించచోమని దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
Updated Date - 2023-11-29T15:25:26+05:30 IST