Nara lokesh: ‘జగన్ మాదిరిగానే వైసీపీ కౌన్సిలర్లు కూడా...’
ABN, First Publish Date - 2023-04-01T09:42:13+05:30
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌పై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్...
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ (TDP Councillor)పై వైసీపీ కౌన్సిలర్లు (YCP Councillors) దాడి చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader NaraLokesh) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy)మాదిరిగానే వైసీపీ కౌన్సిలర్లు కూడా ఫ్రస్టేషన్లో ఉన్నారు. దీనికి నిదర్శనమే గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో వైశ్యుడైన టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై దాడి. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని వైశ్యుడైన సుబ్బారావు గుప్తా బండిలో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన జగన్ రెడ్డి సర్కారు, ఇప్పుడు మరో వైశ్యుడు యుగంధర్ పై తన రౌడీమూకలతో దాడి చేయించింది. మీ ఫ్యాక్షన్ మెంటాలిటీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరపడింది’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
నిన్న జరిగిన తెనాలి కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కౌన్సిలర్ యుగంధర్‌పై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారు. నవరత్నాలు పథకం పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై టీడీపీ సభ్యుడు అభ్యంతరం తెలపగా... వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోవాలని ఎదురుదాడికి దిగారు. తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పినందుకు వైసీపీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ దాడి చేశాడు. కౌన్సిల్ మొత్తం పరిగెత్తించి మరీ దాడికి పాల్పడ్డారు. మిగిలిన కౌన్సిలర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెంటపడి పదేపదే దాడి చేశాడు. గతంలో కూడా ఏదైనా ప్రజా సమస్యలపై టీడీపీ కౌన్సిలర్లు ప్రస్తావించిన ప్రతీసారి తెనాలి కౌన్సిల్ సమావేశంలో దాడులు జరిగిన పరిస్థితిలు ఉన్నాయి. గత దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి టీడీపీ కౌన్సిలర్ యుగంధర్‌పై వైసీపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. వైసీపీ కౌన్సిలర్ల దాడిని నిరసిస్తూ టీడీపీ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు.
Updated Date - 2023-04-01T09:42:13+05:30 IST