ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhi Wife: నా కూతురు భయపడుతోంది... అరగంటలో నా భర్త విషయం తెలియాలి.. లేకపోతే..

ABN, First Publish Date - 2023-02-21T09:55:48+05:30

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కనబడటం లేదంటూ భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (Kommareddy Pathabhi) కనబడటం లేదంటూ భార్య చందన (Pathabhi Wife Chandana) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.... ‘‘పట్టాభిని ఎవరు తీసుకెళ్ళారో తెలీదు. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అరగంట సమయంలో నా భర్త పట్టాభి ఎక్కడున్నాడో నాకు తెలియాలి. లేనిపక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా. నా కూతురు రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని భయపడుతోంది’’ అని తెలిపారు. ప్రజల తరఫున మాట్లాడితే కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. ప్రతి పోలీసు స్టేషన్లకు తమ వాళ్ళను పంపినప్పటికీ పట్టాభి ఎక్కడా లేరని.. ఆయనను ఎక్కడ దాచారని చందన ప్రశ్నించారు.

తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ (Bandaru Vamshi Krishna) మాట్లాడుతూ... గన్నవరం టీడీపీ ఆఫీస్‌ ( Gannavaram TDP Office)తో పాటు టీడీపీ నేతలపై దాడి చేసినట్టు వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (YCP MLA Vallabhaneni Vamshi) నిన్న ఓ టీవీ ఛానల్‌లో ఒప్పుకున్నారన్నారు. అయితే దాడి చేసిన వారిని వదిలేసి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంటలో తమకు సమాచారం రాకపోతే డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు.

టీడీపీ అధినేత కన్నెర్ర...

మరోవైపు గన్నవరం (Gannavaram)లో వైసీపీ నేతలు (YCP Leaders) సృష్టించిన దమనకాండపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం ఘటనపై ఏపీ డీజీపీ (AP DGP)కి లేఖ రాశారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా (Donthu Chinna), కొమ్మారెడ్డి పట్టాభి (Pattabhi) భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్‌ (TDP Office)పై వైసీపీ రౌడీలు దాడి చేసి ధ్వంసం చేశారని, అక్కడ ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారన్నారు. దొంతు చిన్నాకు చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారని, పట్టాభిని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్‌ చేశారా?.. లేక ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?... నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు చంద్రబాబు తెలిపారు.

రెచ్చిపోయిన వైసీపీ మూక...

కాగా.. నిన్న సాయంత్రం గన్నవరంలో వైసీపీ నేతలు(YCP leaders) రెచ్చిపోయాయి. గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office)పై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ (Petrol) పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీల ( TDP Flexies)ను చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు.

ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడకు చేరుకున్నప్పటికీ ఏమీ చేయకుండా కళ్లప్పగించి చూస్తూ ఉన్నారు. చివరకు దాడి చేస్తున్న వైసీపీ నేతలను వదిలి టీడీపీ శ్రేణుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒకనొక సమయంలో టీడీపీ వర్గీయులపై చేయి చేసుకునేందుకు కూడా వెనకాడలేదు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ నేతలు అంటున్నారు.

పోలీసుల సాక్షిగా విధ్వంసం...

ఎమ్మెల్యే వంశీ (MLA Vamshi)పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాడిలో 50-60 మంది అల్లరి మూకలు పాల్గొన్నారు. పోలీసుల సాక్షిగా వంశీ అనుచరుల విధ్వంసకాండకు దిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొదట టీడీపీ ఆఫీస్‌ దగ్గర ఎమ్మెల్యే వంశీ రెక్కీ నిర్వహించారని తెలిపారు. వంశీపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. టీడీపీ నేతలు వెళ్లిన వెంటనే కార్యాలయంపై వంశీ అనుచరుల దాడికి దాగారని చెబుతున్నారు. టీడీపీ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో వైసీపీ గూండాల దాడికి దిగారని టీడీపీ నేతలు అంటున్నారు.

గన్నవరంలో 144 సెక్షన్...

గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ (144 Section) విధిస్తూ.. పోలీస్‌ యాక్ట్‌ 30 (Police Act 30)అమలు చేస్తున్నారు. గన్నవరంలో దాడుల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల (TDP, YCP Office) దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-02-21T10:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising