ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah: వంశీ, కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-25T15:50:21+05:30

వల్లభనేని వంశీ (vallabhaneni vamsi mohan), కొడాలి నాని (kodali nani) పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తీవ్ర వ్యాఖ్యలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: వల్లభనేని వంశీ (vallabhaneni vamsi mohan), కొడాలి నాని (kodali nani) పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఒక మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్.. ఇక కొడాలి నాని ఒక గ్రామ సింహం అంటూ మండిపడ్డారు. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో వైసీపీ (YCP) గుండాలను మించిన అత్యంత తీవ్ర నేరగాడు వల్లభనేని వంశీ. గన్నవరంలో వైసీపీ మూకలు టీడీపీ కార్యాలయం, వ్యక్తులపై దాడికి పాల్పడతారని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ముందే తెలుసు. పోస్టింగ్ ఇవ్వరేమోనన్న భయంతో జిల్లా ఎస్పీ అన్ని విషయాలు దాచి పెడుతున్నారు. పార్టీ ఆఫీస్, నాయకుల ఆస్తులపైనే దాడులు చేసి.. తిరిగి తమ నాయకులపైనే కేసులు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి?, అరాచకాలు, అవినీతితో వైసీపీ సర్కార్ పాలన సాగిస్తోంది.’’ అని ధ్వజమెత్తారు.

భయంతో ఒక్కరూ రావడం లేదు...

‘‘తెలుగుదేశం పార్టీ కార్యాలయం (TDP Office) లో ఒక్కరు లేరు. అందరూ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. నేను వస్తున్నానని ఫోన్ చేస్తే మా పార్టీ వాళ్లు ఒక్కరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. గన్నవరంలో చేసిన దాడి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఇది ప్రభుత్వం చేసిన దాడి. ఏం పాపం చేశామని నాలుగైదుకారులు తగలబెట్టారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పగిలిన అద్దాల మధ్య కూర్చొని మాట్లాడుతున్నా. కార్లు, కార్యాలయం ధ్వంసం చేసిన వాడు బయట దర్జాగా మీసం తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. తప్పుడు కేసుల భయంతో టీడీపీ వాళ్లు అండర్ గ్రౌండ్‌లో దాక్కున్నారు. నేరాన్ని ఆపవలసిన పోలీసులు కూడా వైసీపీ గూండాలతో చేతులు కలిపితే ఎవరు ఆపుతారు. చెప్పండి మై డియర్ ఫ్రెండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM JAGAN). రాళ్లదాడిలో రాళ్లపై పట్టాభి పేరు ఉందని చెప్పలేదు ఈ వండర్‌ఫుల్ ప్రభుత్వం. గొడవ జరిగే సమయంలో సీఐ కనకారావు టీడీపీ వాళ్ల దగ్గర ఉన్నాడు. వైసీపీ వాళ్లు విసిరిన రాళ్లదెబ్బకు కనకారావు గాయపడ్డాడు. విజయవాడ నుంచి సీఐని చంపడానికి పట్టాభి వచ్చాడా? అయినా సీఐ కనకారావుది ఎస్సీ కులము అని పట్టాభికి తెలుసా? నేను కూడా విజయవాడ నుంచే వచ్చాను తంతారా చంపేస్తారా?. సీఎం కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతోనే ఇదంతా జరిగింది. కొడాలి నాని ఒక గ్రామ సింహం. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. చంద్రబాబు ఏనుగు లాంటివారు.’’ అని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: ఈ బాలిక వయసు 11 ఏళ్లు.. నెలకు రూ.1.1 కోట్ల సంపాదన.. సొంతంగా బెంజ్‌కారు.. ఇంతకీ ఏం చేసి ఇన్ని కోట్లు సంపాదిస్తోందంటే..

Updated Date - 2023-02-25T15:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising