గంజాయికి అడ్డుకట్ట వేయాలి
ABN , First Publish Date - 2023-04-04T00:15:27+05:30 IST
గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టాలంటూ కలెక్టరేట్ వద్ద మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎండి సలీం, తెలుగు యువత నగర అధ్యక్షుడు పిన్నింటి అయ్యప్ప, నియోజకవర్గ టీఎన్‌ఎ్‌సఎఫ్ అధ్యక్షుడు డొక్కు సాయి తదితరులు ధర్నా నిర్వహించారు.

మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 3 : గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టాలంటూ కలెక్టరేట్ వద్ద మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎండి సలీం, తెలుగు యువత నగర అధ్యక్షుడు పిన్నింటి అయ్యప్ప, నియోజకవర్గ టీఎన్‌ఎ్‌సఎఫ్ అధ్యక్షుడు డొక్కు సాయి తదితరులు ధర్నా నిర్వహించారు. ఎండి సలీం మాట్లాడుతూ, జిల్లా కేంద్రంగా గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయన్నారు. విద్యార్థులు మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్‌ను పాడుచేసుకుం టున్నారన్నారు. మచిలీపట్నం పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి మణికుమార్, పోతన రాజు, బం దరు రూరల్ మండల తెలుగు యువత అధ్యక్షుడు ఈడే రాజు, గంపల రవితేజ, జింకల వెంకట్, కుమారస్వామి, దినేష్, ఖదీర్, యూసుఫ్, మెహర్, దుర్గారావు, భాను తదితరులు పాల్గొన్నారు.