Share News

ఘనంగా వెనిగండ్ల రాము పుట్టినరోజు వేడుక

ABN , First Publish Date - 2023-12-02T00:31:41+05:30 IST

వెనిగండ్ల ఫౌండేషన్‌ అధినేత, టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము పుట్టనరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొత్త బైపాస్‌ రోడ్డులోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో కేక్‌ను వెనిగండ్ల రాము కట్‌ చేశారు.

ఘనంగా వెనిగండ్ల రాము పుట్టినరోజు వేడుక

గుడివాడ, డిసెంబరు 1 : వెనిగండ్ల ఫౌండేషన్‌ అధినేత, టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము పుట్టనరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొత్త బైపాస్‌ రోడ్డులోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో కేక్‌ను వెనిగండ్ల రాము కట్‌ చేశారు. అర్బన్‌ బ్యాంకు చైౖర్మన్‌ పిన్నమనేని బాబ్జీ, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్లకుమారరాజా వెనిగండ్లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఇన్‌చార్జ్‌ బూరగడ్డ శ్రీ కాంత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను వెనిగండ్ల కట్‌ చేశారు. అట్లూరి వెంకట బసవయ్య కళ్యాణమండపంలో ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి 4800 మందికి వెనిగండ్ల ఫౌండేషన్‌ తరఫున ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని అన్నారు.

వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో

గుడ్లవల్లేరు : గుడ్లవల్లేరు ఎస్‌ఈఆర్‌ఎం పాఠశాల గ్రౌండ్‌లో టీడీపీ నేత వెనిగండ్ల రాము జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడివాడ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నాయకులు ఆయనకు గజమాల వేసి సత్కరించారు అనంతరం రాము భారీ కేక్‌ను కట్‌ చేశారు. టీఎన్‌టీయూసీ, తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా కేక్‌ కట్‌ చేశారు. వల్లభనేని వెంకట సుబ్బారావు చౌదరి, ఈడ్పుగంటి ఉమా మహేశ్వరరావు, బొప్పన శివ ప్రసాద్‌, వీరమాచనేని శివప్రసాద్‌, మల్లిపెద్ది సుబ్రహ్మణ్య చౌదరి, జనసేన మండల ప్రధాన కార్యదర్శి బుల్లా కింగ్‌, మాదాసు ప్రసాదు, వెనిగళ్ల నాగేశ్వరరావు, ప్రభాకర్‌, వల్లభనేని బాపయ్య చౌదరి, వల్లభనేని కృష్ణ ప్రసాద్‌, పొట్లూరి రవికుమార్‌, మురాల నరేష్‌, బొర్రా నాగేశ్వరరావు, లింగం చిట్టిబాబు, పోలవరపు వెంకటరావు, చాపరాల బాలాజీ, చాపరాల రాజేశ్వరరావు, నిమ్మగడ్డ సత్య సాయి, మురాల శ్రీరామ్‌, సూరపనేని పరంధామయ్య, వైపీసీ ప్రసాద్‌, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-02T00:32:09+05:30 IST