Hyderabad: ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన నారా లోకేష్

ABN , First Publish Date - 2023-01-25T15:23:56+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌ (NTR Ghat)కు వచ్చిన ఆయన ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

Hyderabad: ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన నారా లోకేష్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌ (NTR Ghat)కు వచ్చిన ఆయన ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర(Padayatra)కు ముందు ఎన్టీఆర్‌కు లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఆయన కడపకు బయల్దేరారు. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిలను దర్శించుకోనున్నారు. గురువారం తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

దర్శించుకోనున్నారు. 27వ తేదీన కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. కాగా లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేక కర్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. ఇవాళ కార్వాన్ వాహనం హైదరాబాద్ నుంచి కుప్పం బయలుదేరనుంది. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-01-25T15:24:00+05:30 IST