Somi reddy: ఆ మంత్రి సిగ్గుతో తల దించుకోవాలి
ABN, First Publish Date - 2023-06-12T15:12:50+05:30
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవినీతి పెరిగిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు
నెల్లూరు: రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవినీతి పెరిగిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కాకాణి (Kakani Govardhan Reddy) అవినీతిని లైసెన్సడ్ చేసేశారని విమర్శించారు. రైతుల పరికరాల్లో అవినీతి జరిగిందని అగ్రోస్ కార్పొరషన్ చైర్మన్ సీఎంకి లేఖ రాశారని గుర్తుచేశారు. ఎస్సీ ఆర్థిక సంస్థ 24 కోట్ల వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారని.. దీంతో మంత్రి సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. కోర్టు ఫైల్స్ దొంగతనం చేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం సీఎం తప్పు అన్నారు. టీడీపీ హయాంలో కంటే లక్ష ఎక్కువ పెట్టి రైతులకి ట్రాక్టర్లు అమ్ముతున్నారని ఆరోపించారు. కాకాణి రైతుల కోసం ఒక్క జీవో తెచ్చడా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో కాకాణి మంత్రిగా ఆత్మహత్యల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. యాంత్రీకరణ పరికరాల్లో దాదాపు రూ.200 కోట్లు కుంభకోణం జరిగిందని విమర్శించారు. అగ్రికల్చర్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు.
Updated Date - 2023-06-12T15:12:50+05:30 IST