PSLV C-55: పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలు

ABN , First Publish Date - 2023-04-21T13:32:18+05:30 IST

పీఎస్‌ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

PSLV C-55: పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలు

నెల్లూరు: పీఎస్‌ఎల్వీ సి-55 రాకెట్ (PSLV C-55 rocket) ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవగా.. రేపు (శనివారం) మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషులకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది. మొదటి లాంచ్ ప్యాడ్ నుంఛఇ ఈ ప్రయోగం జరుగుతోంది. సింగపూర్‌కు చెందిన టెలియోస్-2, లూమ్ లైట్-4 సాటిలైట్లను పీఎస్ఎల్వీ సి-55 నింగిలోకి మోసుకెళ్లనుంది. సింగపూర్ దేశ భూ పరిశీలనకు టెలియోస్-2 ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఇది పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో కూడిన కమర్షియల్ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీఎస్ఎల్వీ సి-55 4వ దశలో ఎక్స్పీరిమెంటల్ మాడ్యూల్‌ను అమర్చినట్లు చెప్పారు. ఎక్స్పీరిమెంటల్ మాడ్యూల్ ద్వారా పోలార్ ఆర్బిట్లో పరిశోధనలను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు.

అంతకు ముందు.. పీఎస్ఎల్వీ సీ-55 విజయవంతం కావాలని చెంగాలమ్మ ఆలయంలో ఈరోజు ఉదయం ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శనివారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకి ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేశామని చెప్పారు. రాబోయే మూడు నెలల్లో జిఎస్ఎల్వి మాక్-2, ఆదిత్య ఎల్-1, చంద్రయాన్-3 ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సోమనాథ్ వెల్లడించారు.

Updated Date - 2023-04-21T13:32:18+05:30 IST